Share News

‘టాప్‌’ లేపిన అనహత్‌

ABN , Publish Date - Mar 26 , 2025 | 03:27 AM

స్క్వాష్‌ యువ క్రీడాకారిణి అనహత్‌ సింగ్‌ భారత్‌ తరఫున మహిళల్లో నెంబర్‌వన్‌ ర్యాంకర్‌గా నిలిచింది. గతవారం చెన్నైలో జరిగిన ఇండియన్‌ టూర్‌ టైటిల్‌ గెలిచిన 17 ఏళ్ల అనహత్‌....

‘టాప్‌’ లేపిన అనహత్‌

న్యూఢిల్లీ: స్క్వాష్‌ యువ క్రీడాకారిణి అనహత్‌ సింగ్‌ భారత్‌ తరఫున మహిళల్లో నెంబర్‌వన్‌ ర్యాంకర్‌గా నిలిచింది. గతవారం చెన్నైలో జరిగిన ఇండియన్‌ టూర్‌ టైటిల్‌ గెలిచిన 17 ఏళ్ల అనహత్‌.. తాజాగా ప్రకటించిన ప్రపంచ ర్యాంకింగ్స్‌ మహిళల విభాగంలో ఏకంగా 14 స్థానాలు మెరుగై 68వ ర్యాంక్‌ను సాధించింది. దీంతో ఇప్పటిదాకా భారత్‌ నుంచి నెంబర్‌వన్‌ ర్యాంకర్‌గా ఉన్న ఆకాంక్ష సాలుంఖేను అనహత్‌ అధిగమించింది. జోష్న చినప్ప 133వ ర్యాంక్‌తో భారత్‌ నుంచి టాప్‌-3లో ఉంది. పురుషుల విభాగంలో రమిత్‌ టాండన్‌ 33వ, వెలవన్‌ సెంథిల్‌ కుమార్‌ 39వ స్థానంలో కొనసాగుతున్నారు.

ఇవి కూడా చదవండి..

Dhanashree-Ritika: ఛాహల్ మాజీ భార్యపై జర్నలిస్ట్ విమర్శ.. లైక్ కొట్టిన రోహిత్ భార్య రితిక

Vignesh puthur: విఘ్నేష్ పుత్తుర్.. ఆటో డ్రైవర్ కొడుకుతో ధోనీ ఏం మాట్లాడాడంటే..

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 26 , 2025 | 03:33 AM