Share News

GHMC: వీధి దీపాల నిర్వహణకు యాప్‌..

ABN , Publish Date - Mar 26 , 2025 | 07:51 AM

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఓ కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. వీధి దీపాల నిర్వహణకోసం ఓ మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ విషయాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబరిది తెలిపిపారు.

GHMC: వీధి దీపాల నిర్వహణకు యాప్‌..

- అధికారులు, సిబ్బందికి శిక్షణ

హైదరాబాద్‌ సిటీ: గ్రేటర్‌ హైదరాబాద్‏లోని పలు ప్రాంతాల్లో అంధకారం నెలకొందన్న ఫిర్యాదుల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ(GHMC) దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది. వీధి దీపాల మెరుగైన నిర్వహణకు సాంకేతికత వినియోగించాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా మొబైల్‌ యాప్‌(Mobile app)ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు కమిషనర్‌ ఇలంబరిది తెలిపారు.

ఈ వార్తను కూడా చదవండి: CCTV cameras: ఎంఎంటీఎస్‌ బోగీల్లో సీసీ టీవీ కెమెరాలు


city2.2.jpg

జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో టీజీ ఆన్‌లైన్‌ ఏజెన్సీ ద్వారా వీధి దీపాల నిర్వహణ వ్యవస్థపై అధికారులు, సిబ్బందికి మంగళవారం శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. విద్యుత్‌ స్తంభాలు, వీధి దీపాలు, మీటర్లు, సెంట్రలైజ్డ్‌ కంట్రోల్‌ అండ్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌(సీసీఎంఎస్‌) ప్యానల్స్‌ వంటి వివరాలు యాప్‌లో నమోదు చేస్తామని ఇలంబరిది తెలిపారు. ఒక్కో విద్యుత్‌ స్తంభానికి ప్రత్యేక గుర్తింపు నంబర్‌ ఇచ్చి తరచూ సమస్య తలెత్తితే అందుకు కారణం గుర్తించి పరిష్కరించే ప్రయత్నం చేయవచ్చని చెప్పారు.


city2.3.jpg

ఫిర్యాదు వచ్చినప్పుడు యాప్‌ ద్వారా సమస్య ఎక్కడుందన్నది సులువుగా సిబ్బంది గుర్తించవచ్చన్నారు. వీధి దీపాల ఆడిట్‌, డేటా ఎంట్రీ, మరమ్మతు తదితర విషయాలను యాప్‌లో ఎలా అప్‌లోడ్‌ చేయాలన్న దానిపై ఏజెన్సీ ప్రతినిధులు డెమో చూపించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్‌ శివకుమార్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

మీ మనసు బాధపడితే ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటా..

మిస్‌ వరల్డ్‌ పోటీలకు 54 కోట్ల ఖర్చు తప్పుకానప్పుడు ఫార్ములా-ఈ తప్పుకాదు

త్వరలో ఎకో టూరిజం పాలసీ

డ్రగ్స్‌ నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యం

Read Latest Telangana News and National News

Updated Date - Mar 26 , 2025 | 07:51 AM