ప్రియుడితో ఒసాక కటీఫ్
ABN , Publish Date - Jan 08 , 2025 | 05:23 AM
టోక్యో: జపాన్ టెన్నిస్ స్టార్, మాజీ ప్రపంచ నెంబర్‌వన్ నవోమి ఒసాక తన ప్రియుడు కోర్డేతో బంధాన్ని తెంచుకుంది. సంగీతకారుడైన కోర్డేతో ఆరేళ్లుగా సహజీవనం చేస్తున్న...
టోక్యో: జపాన్ టెన్నిస్ స్టార్, మాజీ ప్రపంచ నెంబర్‌వన్ నవోమి ఒసాక తన ప్రియుడు కోర్డేతో బంధాన్ని తెంచుకుంది. సంగీతకారుడైన కోర్డేతో ఆరేళ్లుగా సహజీవనం చేస్తున్న 27 ఏళ్ల ఒసాక.. అతనితో విడిపోయినట్టు తన సోషల్ మీడియాలో ప్రకటించింది. వీరిద్దరికి షాయ్ అనే ఏడాదిన్నర వయసున్న పాప ఉంది. ఆమధ్య కొంతకాలం ఆటకు దూరంగా ఉన్న ఒసాక.. నాలుగురోజుల్లో మొదలయ్యే ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో తలపడుతోంది.