Share News

రోహిత్‌ సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Mar 30 , 2025 | 04:01 AM

ఈ వ్యాఖ్యలు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఎందుకు చేశాడో తెలియదుకానీ..దేశ క్రికెట్‌ వర్గాల్లో మాత్రం సంచలనంగా మారాయి. గత మూడు పరిమిత ఓవర్ల ఐసీసీ టోర్నమెంట్లలో...

రోహిత్‌ సంచలన వ్యాఖ్యలు

ముంబై: ఈ వ్యాఖ్యలు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఎందుకు చేశాడో తెలియదుకానీ..దేశ క్రికెట్‌ వర్గాల్లో మాత్రం సంచలనంగా మారాయి. గత మూడు పరిమిత ఓవర్ల ఐసీసీ టోర్నమెంట్లలో..భారత్‌ 24 మ్యాచ్‌లు ఆడితే ఒకదాంట్లోనే ఓడింది. ఆ ఒక్క ఓటమి భారత్‌ ఆతిథ్యమిచ్చిన 2023 వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఎదురైంది. ఇక..ఇటీవల చాంపియన్స్‌ ట్రోఫీ విజేతగా నిలిచిన భారత్‌.. గత జూన్‌లో టీ20 ప్రపంచ కప్‌ నెగ్గింది. ఈ మధ్యలో స్వదేశంలో న్యూజిలాండ్‌పై, ఆస్ట్రేలియాలో ఆ జట్టు చేతిలో టెస్ట్‌ సిరీ్‌సలు కోల్పోయింది. దీంతో రోహిత్‌పై వచ్చిన విమర్శలు అన్నీఇన్నీ కావు. ఓ దశలో..కెప్టెన్సీ బాధ్యతలనుంచి అతడిని తప్పించాలన్న డిమాండ్లు వినిపించాయి. ఈ పరిణామాలన్నీ రోహిత్‌ను నొప్పించాయేమో! ‘ఐసీసీ టోర్నీల్లో 24 మ్యాచ్‌ల్లో 23 గెలవడం ఆషామాషీకాదు. బయట నుంచి చూస్తే ఈ విజయాలు ఎంతో సంతోషంగా కనిపిస్తాయి. కానీ ఈ క్రమంలో జట్టు ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూసింది. ఈ మూడు ఐసీసీ టోర్నీల్లో పాల్గొన్న జట్టు సభ్యులంతా గౌరవానికి అర్హులు.


నా 18 ఏళ్ల కెరీర్‌లో చవిచూసిన జయాపజయాలు నాకెన్నో పాఠాలు నేర్పాయి. గత 9 నెలలు అందుకు భిన్నం కాదు’ అని ముంబై ఇండియన్స్‌ ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేసిన వీడియోలో రోహిత్‌ అన్నాడు. దాంతో రోహిత్‌ ఈ వ్యాఖ్యల వెనుక మర్మమేమిటన్న చర్చ బయలుదేరింది. ఇటీవల ఎదురైన విమర్శలను దృష్టిలో ఉంచుకొని హిట్‌మ్యాన్‌ ఆ విధంగా అన్నాడని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే..రోహిత్‌ టెస్ట్‌ సిరీస్‌ భవితవ్యంపై సెలెక్టర్లు చర్చించనున్నారనే వార్తల నేపథ్యంలో అతడు ఆ విధంగా వ్యాఖ్యానించాడని మరికొందరంటున్నారు.

ఇవి కూడా చదవండి..

Virat Kohli: ధోనీ ముందే సీఎస్కే బౌలర్‌కు వార్నింగ్.. విరాట్ కోహ్లీ ఎలా సీరియస్ అయ్యాడో చూడండి..

మ్యాచ్ పోయినా రికార్డు మిగిలింది

Updated Date - Mar 30 , 2025 | 04:01 AM