Share News

సాత్విక్‌ తండ్రి హఠాన్మరణం

ABN , Publish Date - Feb 21 , 2025 | 04:40 AM

బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ స్టార్‌ సాత్విక్‌ సాయిరాజ్‌ తండ్రి, విశ్రాంత ఉపాధ్యాయుడు రంకిరెడ్డి కాశీ విశ్వనాథం (67) గురువారం ఉద యం గుండెపోటుతో మరణించారు..

సాత్విక్‌ తండ్రి హఠాన్మరణం

కుమారుడి ‘ఖేల్‌ రత్న’ అవార్డు

కార్యక్రమానికి వెళ్తుండగా గుండెపోటు

అమలాపురం (ఆంధ్రజ్యోతి): బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ స్టార్‌ సాత్విక్‌ సాయిరాజ్‌ తండ్రి, విశ్రాంత ఉపాధ్యాయుడు రంకిరెడ్డి కాశీ విశ్వనాథం (67) గురువారం ఉద యం గుండెపోటుతో మరణించారు. 2024 ఏడాదికిగాను ఖేల్‌రత్న అవార్డును సాత్విక్‌ న్యూఢిల్లీలో అందుకోవాల్సి వుంది. ఈ కార్యక్రమం కోసం భార్య రంగమణితో కలసి అమలాపురం నుంచి రాజమండ్రి ఎయిర్‌ పోర్టుకు వెళ్తుం డగా మార్గమధ్యంలో అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రికి తీసుకెళ్లిన కొద్దిసేపటికే ఆయన కన్నుమూసినట్టు కుటుంబ సభ్యులు చెప్పారు. కుమారుడు సాత్విక్‌ ఖేల్‌రత్న అవార్డును తీసుకునే క్షణాలను చూడాలన్న ఆకాంక్ష నెరవేరకుండానే విశ్వనాథం మరణించడంతో ఆ ఇంట విషాదఛాయలు అలముకున్నాయి. విశ్వనాథం రెండో కుమారుడు సాత్విక్‌. కాగా, ఇప్పటికే ఢిల్లీలో ఉన్న సాయిరాజ్‌.. తండ్రి మరణ వార్తతో హుటాహుటిన ఇంటికి చేరుకొన్నాడు.


ఇవీ చదవండి:

చరిత్ర తిరగరాసిన రోహిత్

షమి తుఫాను.. 4 రికార్డులు బ్రేక్

అల్లు అర్జున్‌ను దించేసిన బంగ్లాదేశ్ బ్యాటర్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 21 , 2025 | 04:40 AM