Share News

ఆ అందమైన అమ్మాయే.. నా గాళ్‌ఫ్రెండ్‌: ధవన్‌

ABN , Publish Date - Apr 04 , 2025 | 04:13 AM

మాజీ క్రికెటర్‌ శిఖర్‌ ధవన్‌ లవ్‌లో పడినట్టు చెప్పాడు. కానీ, ఆమె పేరును వెల్లడించలేదు. ఓ మీడియా చానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో...

 ఆ అందమైన అమ్మాయే.. నా గాళ్‌ఫ్రెండ్‌: ధవన్‌

న్యూఢిల్లీ: మాజీ క్రికెటర్‌ శిఖర్‌ ధవన్‌ లవ్‌లో పడినట్టు చెప్పాడు. కానీ, ఆమె పేరును వెల్లడించలేదు. ఓ మీడియా చానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ధవన్‌ మాట్లాడుతూ.. ‘ఇప్పుడు ప్రేమలో ఉన్నా. ఆమె పేరు చెప్పలేను కానీ.. ఆ అందమైన అమ్మాయే నా గాళ్‌ఫ్రెండ్‌’ అని చెప్పాడు. చాంపియన్స్‌ ట్రోఫీ సందర్భంగా ధవన్‌.. ఐర్లాండ్‌కు చెందిన సోఫీ షైన్‌ అనే అమ్మాయితో కనిపించాడు. ఈమే గబ్బర్‌ గాళ్‌ఫ్రెండ్‌ అని కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 04 , 2025 | 04:13 AM