బ్యాటింగ్ కోచ్‌గా సితాన్షు కోటక్
ABN , Publish Date - Jan 17 , 2025 | 05:23 AM
భారత క్రికెట్ జట్టు బ్యాటింగ్ కోచ్‌గా సితాన్షు కోటక్‌ను నియమించారు. ఇంగ్లండ్‌తో జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం ఈ ఎంపిక జరిగింది. 2019 నుంచి తను...

న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు బ్యాటింగ్ కోచ్‌గా సితాన్షు కోటక్‌ను నియమించారు. ఇంగ్లండ్‌తో జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం ఈ ఎంపిక జరిగింది. 2019 నుంచి తను జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో సేవలందిస్తున్నాడు. అలాగే అనేకసార్లు భారత్ ‘ఎ’ జట్టుకు కోచ్‌గా వ్యవహరించాడు. ఈనెల 22 నుంచి జరిగే ఐదు టీ20ల సిరీస్ కోసం కోటక్ 18న భారత శిబిరంలో చేరనున్నాడు. ప్రస్తుతం ప్రధాన కోచ్‌గా ఉన్న గంభీర్‌కు కోటక్ ఐదో సహాయక కోచ్ కానున్నాడు. ఇప్పటికే అభిషేక్ నాయర్, డస్కటే అసిస్టెంట్ కోచ్‌లుగా ఉండగా, మోర్కెల్ బౌలింగ్ కోచ్, దిలీప్ ఫీల్డింగ్ కోచ్‌లుగా ఉన్నారు. ఆసీస్ టూర్‌లో భారత టెస్టు జట్టు వైఫల్యంపై గత వారం సమీక్ష జరిగింది. ఇందులో గంభీర్ తమకు స్పెషలిస్ట్ బ్యాటింగ్ కోచ్ అవసరం ఉందని బోర్డుకు తెలిపినట్టు సమాచారం.
బీసీసీఐ అంబుడ్స్‌మన్‌గా జస్టిస్ అరుణ్ మిశ్రా: సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ మిశ్రాను బీసీసీఐ అంబుడ్స్‌మన్‌గా నియమించారు. అలాగే ఆయన బోర్డు ఎథిక్స్ అధికారిగా కూడా వ్యవహరించనున్నారు. ఆరేళ్లపాటు అత్యున్నత కోర్టు జడ్జిగా కొనసాగిన మిశ్రా.. ఆ తర్వాత మూడేళ్లు జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌గా ఉన్నారు.