టాప్-100లో స్నేహిత్
ABN , Publish Date - Apr 02 , 2025 | 04:42 AM
తెలుగు క్రీడాకారుడు ఫిడేల్ ఆర్ స్నేహిత్ ప్రపంచ టేబుల్ టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో అదరగొట్టాడు. అంతర్జాతీయ టీటీ సమాఖ్య మంగళవారం విడుదలజేసిన ర్యాంకింగ్స్‌లో...

ప్రపంచ టీటీలో తెలుగు కుర్రాడికి 89వ ర్యాంక్
47వ స్థానానికి మానవ్
న్యూఢిల్లీ: తెలుగు క్రీడాకారుడు ఫిడేల్ ఆర్ స్నేహిత్ ప్రపంచ టేబుల్ టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో అదరగొట్టాడు. అంతర్జాతీయ టీటీ సమాఖ్య మంగళవారం విడుదలజేసిన ర్యాంకింగ్స్‌లో స్నేహిత్ సింగిల్స్‌లో ఏకంగా 34 స్థానాలు ఎగబాకాడు. ఓవరాల్‌గా 89వ ర్యాంకులో నిలిచి తొలిసారి టాప్-100లో చోటు దక్కించుకున్నాడు. ఓ తెలుగు ఆటగాడు టాప్-100లోపు ర్యాంక్ సాధించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. గతవారం చెన్నై వేదికగా జరిగిన డబ్ల్యూటీటీ స్టార్ కంటెండర్ టోర్నీలో స్నేహిత్ ప్రీక్వార్టర్స్‌లో వెటరన్ స్టార్ శరత్ కమల్‌ను ఓడించి సంచలన ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇదే టోర్నీతో ఆటకు వీడ్కోలు పలికిన శరత్ కమల్ 80వ ర్యాంక్‌తో కెరీర్‌ను ముగించాడు. చెన్నై టోర్నీలో సెమీస్ చేరి రికార్డుకెక్కిన భారత స్టార్ మానవ్ టక్కర్ 47వ ర్యాంకుతో తన కెరీర్‌లో అత్యుత్తమస్థానాన్ని దక్కించుకున్నాడు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..