Share News

కార్పొరేట్‌కు దీటుగా కేజీబీవీలు

ABN , Publish Date - Apr 07 , 2025 | 11:21 PM

కార్పొరేట్‌ విద్యాసంస్థలకు దీటుగా కస్తూర్భాగాంధీ బాలిక విద్యాలయం(కేజీబీవీ)లలో అన్ని మౌలిక వసతు లు కల్పిస్తున్నట్టు ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహా రెడ్డి అన్నారు. గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు అత్యుత్తమ విద్య అందేలా కేజీబీవీలను తీర్చిదిద్దు తున్నట్టు చెప్పారు.

కార్పొరేట్‌కు దీటుగా కేజీబీవీలు

ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి

వెలిగండ్ల, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): కార్పొరేట్‌ విద్యాసంస్థలకు దీటుగా కస్తూర్భాగాంధీ బాలిక విద్యాలయం(కేజీబీవీ)లలో అన్ని మౌలిక వసతు లు కల్పిస్తున్నట్టు ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహా రెడ్డి అన్నారు. గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు అత్యుత్తమ విద్య అందేలా కేజీబీవీలను తీర్చిదిద్దు తున్నట్టు చెప్పారు. స్థానిక కేజీబీవీ పాఠశాలలో రూ.కోటి 49 లక్షలతో నిర్మాణం చేపట్టనున్న జూని యర్‌ కళాశాల భవన నిర్మాణానికి సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా డాక్టర్‌ ఉగ్ర మాట్లాడుతూ అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత పాఠశాల ల్లోని ఉపాధ్యాయులపై ఉందన్నారు.

కేజీబీవీలో మౌలిక వసతులపై విద్యార్థిలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో విద్యుత్‌ సమస్య ఉందని సిబ్బంది తెలిపారు. వెంటనే విద్యుత్‌ అధికారులను ఎమ్మెల్యే పిలిపించి మరమ్మతులు చే యాలని ఆదేశించారు. పాఠశాలలో మ ధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించా రు. విద్యార్థినులకు సకాలంలో భోజనం పెట్టకపోయినా, మెనూ పాటించకపోయి నా చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షు డు ముత్తిరెడ్డి వెంకటరెడ్డి, దొడ్డా వెంకట సుబ్బారెడ్డి, కేలం ఇంద్ర భూపాల్‌రెడ్డి, ముక్కు పెద్దిరెడ్డి, గవదకట్ల హరి, గొనా ప్రతాప్‌, బీరం వెంటేశ్వర రెడ్డి, చిలకల వెంటేశ్వర రెడ్డి, కొండు భాస్కర్‌ రెడ్డి, కారంపూడి వెంకటేశ్వర్లు, దేవిరెడ్డి రామిరెడ్డి, కొంగొలు శ్రీను, మీనిగ కాశయ్య, కేసరి రమణారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Apr 07 , 2025 | 11:21 PM