Share News

ఆర్చర్లు ధీరజ్‌, చికితకు వీసా కష్టాలు

ABN , Publish Date - Apr 02 , 2025 | 04:47 AM

ఆర్చరీ వరల్డ్‌కప్‌ స్టేజ్‌-1 పోటీల్లో పాల్గొనాల్సిన తెలుగు ఆర్చర్లు బొమ్మదేవర ధీరజ్‌, తానిపర్తి చికితరావుకు వీసా కష్టాలు మొదలయ్యాయి. అమెరికా ఆతిథ్యమిస్తున్న...

ఆర్చర్లు ధీరజ్‌, చికితకు వీసా కష్టాలు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఆర్చరీ వరల్డ్‌కప్‌ స్టేజ్‌-1 పోటీల్లో పాల్గొనాల్సిన తెలుగు ఆర్చర్లు బొమ్మదేవర ధీరజ్‌, తానిపర్తి చికితరావుకు వీసా కష్టాలు మొదలయ్యాయి. అమెరికా ఆతిథ్యమిస్తున్న ఈ వరల్డ్‌కప్‌ టోర్నీ ఈనెల 8న ప్రారంభం కానుంది. జ్యోతి సురేఖ, ధీరజ్‌, చికిత సహా 23 మంది భారత ఆర్చర్లు బరిలోకి దిగుతున్నారు. వీరిలో ధీరజ్‌, చికితతో పాటు మరో 9మంది వీసాలకు దరఖాస్తు చేస్తున్నప్పుడు సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయి. దీంతో నిర్దిష్ట గడువులోపు దరఖాస్తులు పంపకపోవడంతో వీసాలు మంజూరు కాలేదు. ఈనెల 5వ తేదీలోపు అక్కడికి చేరుకోవాలి. విమాన టిక్కెట్లు బుక్‌ అయ్యాయి కానీ వీసాలు మంజూరవలేదు. తెలుగు రాష్ట్రాల కేంద్ర మంత్రులు కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌, రామ్మోహన్‌ నాయుడు, చంద్రశేఖర్‌ ఈ విషయంలో చొరవ తీసుకోవాలని ఆర్చర్లు సోషల్‌ మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్‌తో మాట్లాడి తమకు వీసాలు వచ్చేలా చూడాలని కోరుతున్నారు.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 02 , 2025 | 04:47 AM