త్రిషకు రూ. కోటి నజరానా
ABN , Publish Date - Feb 06 , 2025 | 03:48 AM
ఐసీసీ అండర్-19 టీ20 వరల్డ్‌కప్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన భద్రాచలం అమ్మాయి గొంగడి త్రిషా రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి ఘనంగా సత్కరించారు...

ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
స్పిన్నర్ ధ్రుతి, సహాయ సిబ్బందికి తలో రూ.10 లక్షలు
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఐసీసీ అండర్-19 టీ20 వరల్డ్‌కప్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన భద్రాచలం అమ్మాయి గొంగడి త్రిషా రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి ఘనంగా సత్కరించారు. బుధవారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని రేవంత్ రెడ్డి నివాసంలో ఆయన్ని త్రిష మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా త్రిషను అభినందించిన సీఎం.. ప్రభుత్వం తరఫున రూ. కోటి నజరానా ప్రకటించారు. త్రిషతో పాటు ఈ వరల్డ్‌కప్ జట్టులో సభ్యురాలైన హైదరాబాద్ క్రికెటర్ కేసరి ధ్రుతికి రూ.10 లక్షలు, భారత జట్టు ప్రధాన కోచ్‌గా పనిచేసిన హైదరాబాదీ నౌషీన్ అల్ ఖదీర్, ఫిట్‌నెస్ ట్రైనర్ షాలినికి చెరో రూ.10 లక్షల రివార్డును సీఎం ప్రకటించారు. కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, శాట్ చైర్మన్ శివసేనారెడ్డి, సీఎం కార్యదర్శి షానవాజ్ ఖాసీం, శాట్ వీసీ-ఎండీ సోనీ బాలాదేవి తదితరులు పాల్గొన్నారు.
హెచ్‌సీఏ నుంచి రూ.10 లక్షలు..
వరల్డ్‌క్‌పలో పాల్గొన్న తెలంగాణ క్రికెటర్లు, సహాయ సిబ్బందికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు కూడా రివార్డు ప్రకటించారు. త్రిషకు రూ.10 లక్షలు, ధ్రుతి, నౌషీన్, షాలినికి తలో రూ.5 లక్షలను అందజేస్తామన్నారు. ఇక, ఈ సీజన్ రంజీ ట్రోఫీలో హైదరాబాద్ తరఫున అత్యధిక రన్స్ చేసిన తన్మయ్ అగర్వాల్, అత్యధిక వికెట్లు తీసిన తనయ్ త్యాగరాజన్‌కు చెరో రూ.5 లక్షలు ప్రకటించారు.
ఇదీ చదవండి:
పోయిన చోటే వెతుక్కుంటున్న వరుణ్.. విధినే ఎదిరించిన యోధుడు
ఇంగ్లండ్‌తో తొలి వన్డే.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే..
సిక్సులతో విరుచుకుపడ్డ రోహిత్-కోహ్లీ.. క్రెడిట్ అంతా అభిషేక్‌కే
మరిన్ని క్రీడలు, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి