షమి పరిస్థితేంటి? ప్రశ్నించిన శాస్త్రి
ABN , Publish Date - Jan 08 , 2025 | 05:21 AM
వెటరన్ పేసర్ మహ్మద్ షమి గాయాల నియంత్రణతోపాటు అతడి పునరాగమనం గురించి దిగ్గజాలు రవిశాస్త్రి, రికీ పాంటింగ్ ప్రశ్నలు లేవనెత్తారు. ఒకవేళ షమి జట్టులో ఉండి ఉంటే....
సిడ్నీ: వెటరన్ పేసర్ మహ్మద్ షమి గాయాల నియంత్రణతోపాటు అతడి పునరాగమనం గురించి దిగ్గజాలు రవిశాస్త్రి, రికీ పాంటింగ్ ప్రశ్నలు లేవనెత్తారు. ఒకవేళ షమి జట్టులో ఉండి ఉంటే.. బోర్డర్-గవాస్కర్ సిరీస్ ఫలితం భారత్‌వైపు మొగ్గి ఉండేదని అభిప్రాయపడ్డారు. తానైతే షమిని ఆసీ్‌సకు తీసుకువచ్చి వైద్యుల పర్యవేక్షణలో ఉంచేవాడినని శాస్త్రి అన్నాడు. బుమ్రాకు మిగతా పేసర్ల సహకారం అవసరం అని చెప్పాడు. శాస్ర్తి అభిప్రాయంతో పాంటింగ్ కూడా ఏకీభవించాడు. షమి లేకపోతే సిరీ్‌సలో భారత్ 1-3తో ఓడిపోతుందని తాను ముందుగానే చెప్పినట్టు గుర్తు చేశాడు.