IPL 2025 LSG Vs MI: ముంబై ఇండియన్స్‌కు ఊరట..
ABN , Publish Date - Apr 04 , 2025 | 08:26 PM
ఎల్‌ఎస్‌జీ దూకుడుతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ముంబై ఇండియన్స్ ఊరట దక్కింది. కీలకమైన మార్ష్‌తో పాటు నికోలస్ పూరన్ కూడా పెవిలియన్ బాట పట్టారు

ఇంటర్నెట్ డెస్క్: ఎల్‌ఎస్‌జీ దూకుడుతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ముంబై ఇండియన్స్ ఊరట దక్కింది. అర్ధసెంచరీతో పరుగుల వరద పారిస్తున్న ఎల్ఎస్‌జీ ఓపెనర్ మిచెల్ మార్ష్ పెవిలియన్ బాట పట్టాడు. ఆ తరువాత కాసేపటికే నికోలస్ పూరన్ (12) హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో దీపక్ చహార్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
ముంబైకి చుక్కులు చూపించిన మిచెల్ మార్ష్.. విఘ్నేశ్ పుత్తర్ బౌలింగ్‌లో 6.6 ఓవర్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి వికెట్ సమర్పించుకున్నాడు. కాగా, తొలి నుంచీ దూకుడుగా ఆడటం ప్రారంభించిన మిచెల్ మార్ష్ కేవలం 27 పరుగులలోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఈ సీజన్‌లో మార్ష్‌కు ఇది ఆరో అర్ధసెంచరీ. అరవై పరుగులతో తన టీమ్‌కు మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. పది ఓవర్లు ముగిసేసరికి ఎల్ఎస్‌జీ రెండు వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది.
ఇవి కూడా చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి