Share News

Viral Video: మేకకు ఏం కష్టం వచ్చిందో.. ఎంత ఆపినా వినకుండా అగ్గిలోకి..

ABN , Publish Date - Apr 04 , 2025 | 08:03 PM

Goat Rushing Into Burning Fire: ఓ మేకకు ఏం కష్టం వచ్చిందో తెలీదు కానీ.. అగ్గిలోకి దూకాలని చూసింది. యజమాని ఎంత ప్రయత్నించినా అది మొండిగా అగ్గిలోకి వెళ్లడానికి ప్రయత్నించింది.

Viral Video: మేకకు ఏం కష్టం వచ్చిందో.. ఎంత ఆపినా వినకుండా అగ్గిలోకి..
Viral Video

మనుషులకు.. జంతువులకు మధ్య తేడా ఏంటంటే.. మనం ఆలోచించినంత తెలివిగా.. జంతువులు ఆలోచించలేవు. అందుకే మనిషి వాటి మీద పెత్తనం చేస్తున్నాడు. తన అవసరాలకు తగ్గట్టు వాటిని వాడుకుంటున్నాడు. ఇక, జంతువుల అమాయకత్వానికి అద్దం పట్టే ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ మేక ఇంట్లో ఉండే ఫైర్ ప్లేస్‌( ఇంటిని వెచ్చగా ఉంచడానికి ఇంటి గోడలో ఓ ప్రత్యేక రంధ్రం ఉంటుంది. అందులో కర్రలు వేసి మంట పెడతారు. తద్వారా ఇళ్లు మొత్తం వెచ్చగా ఉంటుంది)దగ్గరకు వచ్చింది. పాపం దానికి చలి పెడుతున్నట్లు ఉంది.


కొన్ని క్షణాలు అక్కడే నిలబడి అటు, ఇటు చూసింది. అది మంటల్లోకి వెళుతుందని భావించిన యజమాని పరిగెత్తుకుంటూ దాని దగ్గరకు వచ్చాడు. అది యజమాని పరిగెత్తుకుంటూ రావటంతో భయపడింది. ఫైర్‌ప్లేస్‌లోకి వెళ్లబోయింది. అతడు వెంటనే దాన్ని పట్టుకున్నాడు. అది మరింత వేగంగా మంటల్లోకి తల పెట్టింది. దాని శరీరంలో సగ భాగం మంటల్లోకి వెళ్లింది. యజమాని దాని కాలుపట్టుకుని బలవంతంగా పక్కకు లాక్కువచ్చాడు. అయినా, అది మళ్లీ అక్కడికి వెళ్లింది. మంటల్లోకి దూకింది. యజమాని మళ్లీ దాని కాలు పట్టుకుని బలవంతంగా పక్కకు తీసుకువచ్చాడు. అప్పుడు అది అక్కడినుంచి వెళ్లిపోయింది.


సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. కొందరు ఫన్నీగా కామెంట్లు.. ‘మనుషులకే కాదు.. మేకలకు కూడా కష్టాలు ఉంటాయి. అందుకే పాపం.. అది చనిపోవాలని అనుకుంది. కానీ, దాని యజమాని కాపాడాడు’..‘ ఈ మూగ జీవాలకు తెలివి లేదు అనడానికి ఇదే ప్రత్యక్ష సాక్ష్యం.. గొర్రె తెలివి అని ఊరికే అనలేదు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

Kancha Gachibowli Land: కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సర్కార్ సీరియస్.. చర్యలకు రంగం సిద్ధం..

Indian Americans: సీన్ రివర్స్.. ఇకపై భారత్ నుంచి ఐఫోన్ కావాలని, ఎన్నారై ఫ్రెండ్స్ అడిగే ఛాన్స్..

Updated Date - Apr 04 , 2025 | 08:26 PM