సన్న బియ్యం పథకంతో పేదలకు చేయూత
ABN , Publish Date - Apr 05 , 2025 | 11:32 PM
రాష్ట్ర ప్రభుత్వం పేదల కడుపు నింపాలనే ఉద్దేశంతో తీసుకువచ్చిన సన్న బియ్యం పథకం ఎంతో చేయూత ఇస్తుందని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలతో ఆసిఫాబాద్ మండలం ఆర్‌ఆర్ కాలనీలోని సన్నబియ్యం లబ్ధిదారుడు శంకర్ ఇంట్లో అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి కలెక్టర్ శనివారం భోజనం చేశారు.

- కలెక్టర్ వెంకటేష్ దోత్రే
ఆసిఫాబాద్ రూరల్, ఏప్రిల్ 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం పేదల కడుపు నింపాలనే ఉద్దేశంతో తీసుకువచ్చిన సన్న బియ్యం పథకం ఎంతో చేయూత ఇస్తుందని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలతో ఆసిఫాబాద్ మండలం ఆర్‌ఆర్ కాలనీలోని సన్నబియ్యం లబ్ధిదారుడు శంకర్ ఇంట్లో అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి కలెక్టర్ శనివారం భోజనం చేశారు. ఈ సందర్భంగా వారి కుటుంబ వివరాలు అడిగి తెలుసుకోవడంతో పాటు సన్న బియ్యం పథకంపై వారి అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. లబ్ధిదారుడికి తెలుగు రాక పోవడంతో ఆయన మాతృభాష మరాఠీలో ముచ్చటించారు. లబ్ధిదారుడి సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆర్డీవోను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటేష్ దోత్రే మాట్లాడుతూ సన్న బియ్యం పథకంలో పేదలు ఎంతో సంతోషంగా ఉన్నారని అన్నారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ ప్రక్రియ పూర్తి కావచ్చిందన్నారు. జగ్జీవన్ రామ్ జయంతి రోజు దళిత కుటుంబంలో భోజనాలు చేయడం మర్చిపోలేనని అన్నారు. పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. సన్న బియ్యం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రోహిత్ దేశ్‌పాండే, ఆర్‌ఐ రహమత్, నాయకులు శంకర్, తదితరులు ఉన్నారు.