Andhra Jyothi Panchangam: ఆంధ్రజ్యోతి ‘విశ్వావసు’ పంచాంగం విడుదల
ABN , Publish Date - Mar 26 , 2025 | 05:13 AM
ఉగాది సందర్భంగా ఆంధ్రజ్యోతి పంచాంగం పుస్తకాన్ని పాఠకులకు అందిస్తోంది. ఈ సంవత్సరం విప్రో సంతూర్ సోప్ దీనికి ప్రాయోజకత్వం వహించింది. విశ్వావసు నామ సంవత్సర పంచాంగంతో పాటు కొత్తగా విడుదలైన ‘సంతూర్ లైమ్’ సోప్‌ను శాంపిల్‌గా జత చేశారు.

బెంగళూరు, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): ఉగాది సందర్భంగా ప్రతి ఏటా ఆంధ్రజ్యోతి పంచాంగం పుస్తకాన్ని పాఠకులకు అందిస్తోంది. ఈ సంవత్సరం ఆంధ్రజ్యోతి పంచాంగానికి విప్రో కంపెనీ వారి సంతూర్ సోప్ ప్రాయోజకత్వం వహించింది. ప్రస్తుతం ‘విశ్వావసు’ నామ సంవత్సర పంచాగంతోపాటు కొత్తగా విడుదల చేస్తున్న ‘సంతూర్ లైమ్’ సోప్‌ను శాంపిల్‌గా జత చేస్తున్నట్టు విప్రో కన్స్యూమర్ కేర్ అండ్ లైటింగ్ సీఎంవో ఎస్ ప్రసన్న రై తెలిపారు. సంతూర్ సోప్ ప్రాయోజకత్వంలో ఆదివారం లక్షలాదిమంది ‘ఆంధ్రజ్యోతి’ పాఠకులకు పంచాంగంతో పాటు సోపులు చేరనున్నాయి. విప్రో కన్స్యూమర్ కేర్ ప్రధాన కార్యాలయం బెంగళూరులో మంగళవారం పంచాంగం పుస్తకాన్ని ప్రసన్న రై విడుదల చేశారు. ఆంధ్రజ్యోతి ద్వారా సంతూర్ సోప్ నూతన ఉత్పత్తి లైమ్‌ను విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు. నిమ్మ, అలోవెరా, మెంథాల్‌ల సువాసన గల ఈ సోప్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వినియోగదారులు ఆదరిస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు. సంతూర్ బ్రాండ్ మేనేజర్ రవీంద్ర మాట్లాడుతూ.. ఆంధ్రజ్యోతితో విప్రో సంతూర్ అనుబంధం దశాబ్దాలుగా కొనసాగుతోందని గుర్తు చేశారు. కార్యక్రమంలో విప్రో ప్రతినిధులు సుమన్‌పాల్, కావ్య, శిసేందు చటర్జీ, ఆంధ్రజ్యోతి బెంగళూరు జీఎం శ్రీకాంత్, డీజీఎం సుధాకర్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
CM Chandrababu On DSC: మెగా డీఎస్సీపై కీలక అప్డేట్.. వచ్చే నెల మొదటి వారంలోనే
Viveka Case Update: వివేకా హత్య కేసు.. అవినాష్ కుట్రను బయటపెట్టిన ఏపీ సర్కార్
Vallabhaneni Vamsi Remand: మరికొన్ని రోజులు జైల్లోనే వంశీ