Exams: పరీక్ష కేంద్రంలో విద్యార్థినులకు లైంగిక వేధింపులు
ABN , Publish Date - Mar 27 , 2025 | 01:28 PM
మహిళలకు, చిన్నారులకు ఎక్కడా రక్షణ లేకుండా పోతోందనడానికి ఈ ఒక్క సంఘటనే సాక్ష్యంగా చెప్పవచ్చు. పరీక్షా కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినులను లైంగికంగా వేధించిన విషయం వెలుగులోకి వచ్చింది. స్థానికంగా ఈ విషయం పెను దుమారానికి దారితీసింది.

- ఉపాధ్యాయుడి అరెస్ట్
చెన్నై: పరీక్షా కేంద్రంలో విద్యార్థినులను లైంగికంగా వేధించిన ఉపాధ్యాయుడు కటకటాలపాలయ్యాడు. తిరుప్పూర్ పళనియప్ప నగర్‌కు చెందిన సంపత్‌కుమార్ (32) అమ్మాపాళయంలో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్నాడు. ప్లస్ టూ పబ్లిక్ పరీక్షల సందర్భంగా ఓ ప్రభుత్వ మహోన్నత పాఠశాలలో ఇన్విజిలేటర్‌గా పనిచేశాడు. మంగళవారం ప్లస్ టూ ఆఖరి పరీక్ష కావడంతో, సంపత్‌కుమార్ ఉన్న గదిలో ఆరుగురు విద్యార్థినులు సహా 11 మంది పరీక్షకు హాజరయ్యారు.
ఈ వార్తను కూడా చదవండి: RRTS: మూడు మార్గాల్లో ఆర్‌ఆర్‌టీఎస్ సేవలు
ఆ సమయంలో పరీక్షా కేంద్రంలోకి కాపీలు తీసుకొచ్చారా అంటూ సంపత్‌కుమార్, ఆరుగురు విద్యార్థినుల శరీర భాగాలు తడుముతూ వేధింపులకు పాల్పడినట్లు తెలిసింది. పరీక్ష తరువాత బయటకు వచ్చిన ఆ విద్యార్థినులు ఈ విషయాన్ని తల్లిదండ్రులు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదు చేశారు.
హెచ్‌ఎం ఫిర్యాదుతో పోలీసు అసిస్టెంట్ కమిషనర్ ప్రదీ్‌పకుమార్ పాఠశాలకు చేరుకొని బాధిత విద్యార్థులను విచారించారు. విచారణలో సంపత్‌కుమార్ వేధింపులకు పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో, కొంగునగర్ మహిళా పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదుచేసి సంపత్‌కుమార్‌ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
‘పది’ ప్రశ్నపత్రం లీకేజీకి రాజకీయ రంగు
Read Latest Telangana News and National News