Car: ఆయనకు కారు కొన్న సంతోషం కూడా లేకనాయే.. ఏం జరిగిందంటే..
ABN , Publish Date - Mar 27 , 2025 | 11:48 AM
ఆయనకు కారు కొన్న ఆనందం కూడా లేకుండా పోయింది. కొన్న నాలుగు రోజులకే బ్రేక్ డౌన్ కావడంతో ఇక ఆయనలోని అపరిచితుడు నిద్రలేచాడు. కారు అమ్మిన షోరూం వద్దకు వెళ్లి గొడవకు దిగాడు. అంతడబ్బుపెట్టి కొంటే నాలుగు రోజులకే ఇలా జరగడంతో షోరూం యాజమాన్యంతో గొడవకు దిగాడు. వివరాలిలా ఉన్నాయి.

- కారు కొన్న నాలుగు రోజులకే బ్రేక్‌డౌన్..
- షోరూం వద్ద వినియోగదారుడి ఆందోళన
- నిర్వాహకులతో వాగ్వాదం
హైదరాబాద్ సిటీ: కారు కొన్న నాలుగు రోజులకే బ్రేక్ డౌన్ అయిందని షోరూంకు తీసుకువస్తే వినియోగదారుడిపైనే దాడి చేసిన ఘటన మాదాపూర్‌లో జరిగింది. బాధితుడు సామల రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం.. మాదాపూర్(Madhapur)లోని తేజస్విని టాటా మోటార్స్‌లో అక్టోబర్ 10న టాటా సఫారి కారు కొన్నాడు. కొన్న 10 రోజుల్లోనే బ్యాటరీ ఫెయిల్యూర్‌తో కారు ఆగిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 5 సార్లు కారు ఆగిపోయింది.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ఇప్పటి వరకు వసూలైంది రూ.60 కోట్లు మాత్రమే..
సర్వీసుకు ఇచ్చినప్పుడల్లా వారం పదిరోజులు ఉంచుకుని ఇస్తున్నారు తప్ప కారులో ఉన్న లోపాన్ని సరిదిద్దడం లేదు. ఈ కారు డిఫెక్ట్‌తో ఉందని, దీన్ని తీసుకొని కొత్త కారు ఇవ్వాలని, లేదంటే డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరితే దానికి షోరూం నిర్వాహకులు అదనపు వారంటీ ఇస్తామంటూ చెబుతున్నారే తప్ప, ఎలాంటి గ్యారెంటీ ఇవ్వడం లేదని బాధితుడు వాపోయాడు. ఇలాంటి కారుతో తాను బయటికి వెళ్లలేకపోతున్నానని, కొత్త కారు ఇలా కావడం ఏంటని అడిగితే సరైన సమాధానం ఇవ్వకుండా తనపై దౌర్జన్యం చేస్తున్నారని, షోరూం నుంచి బయటకు పంపిస్తున్నారని కారు యజమాని ఆవేదన వ్యక్తం చేశాడు.
షోరూం నిర్వాహకులు తన సమస్యను పరిష్కరించకపోవడంతో తన కారుకు బ్యానరు కట్టి షోరూం ముందు నిలబడి తాను కారు కొనుగోలు చేసిన తర్వాత ఎదురైన సమస్యలను, అనుభవాలను పేర్కొంటూ నిరసన తెలిపాడు. దీంతో షోరూం ముందు వాగ్వివాదం చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న మాదాపూర్(Madhapur) పోలీసులు అక్కడికి చేరుకొని కారు యజమాని, షోరూమ్ నిర్వాహకులతో మాట్లాడి వివాదం సద్దుమణిగేలా చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
‘పది’ ప్రశ్నపత్రం లీకేజీకి రాజకీయ రంగు
Read Latest Telangana News and National News