ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - Mar 31 , 2025 | 11:30 PM
ఆరోగ్యం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజారోగ్యానికి తమ ప్రభుత్వం ప్రణాళిక బద్ధంగా పని చేస్తుందని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తెలి పారు. సోమవారం పట్టణంలోని పాత బస్టాండ్‌లో వన్‌మెడ్ హబ్ ఎమ్మె ల్యే సంయుక్తంగా చేపట్టిన మొబైల్ మెడికల్ క్యాంప్‌ను ప్రారంభోత్స వానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి
మందమర్రిటౌన్, మార్చి31 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్యం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజారోగ్యానికి తమ ప్రభుత్వం ప్రణాళిక బద్ధంగా పని చేస్తుందని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తెలి పారు. సోమవారం పట్టణంలోని పాత బస్టాండ్‌లో వన్‌మెడ్ హబ్ ఎమ్మె ల్యే సంయుక్తంగా చేపట్టిన మొబైల్ మెడికల్ క్యాంప్‌ను ప్రారంభోత్స వానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన ప్రజల ను ఉద్దేశించి మాట్లాడారు. రోజు రోజుకూ పెరుగిపోతున్న యాంత్రీకర ణతో ప్రజల జీవన శైలిలో మార్పు వచ్చిందని దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆరోగ్య పరీక్షలు చేసుకోవడం వారికే మంచిదని పేర్కొన్నారు. తాను వైద్యునిగా ప్రజారోగ్యం పట్ల ప్రత్యేక దృష్టి ఉంటుందని అందుకే ఇలాంటి పరీక్షలు చేసుకోవాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. అనం తరం ఆయన పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ప్రభుత్వ వైద ్య సిబ్బందితోపాటు మున్సిపల్ కమిషనర్ రాజలింగు, కాంగ్రెస్ పార్టీ దాని అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.