Share News

Trump Tariff Shock: దేశాలు, రంగాలవారీగా సుంకాలు

ABN , Publish Date - Apr 03 , 2025 | 05:04 AM

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతీకార సుంకాల విధింపుపై కీలక ప్రకటన చేయనున్న నేపథ్యంలో దేశాలు రంగాలవారీగా ప్రత్యేక సుంకాలు విధించనున్నట్లు వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి భారతదేశంపై వీటి ప్రభావాన్ని అంచనా వేసేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు

Trump Tariff Shock: దేశాలు, రంగాలవారీగా సుంకాలు

  • ప్రతీకార సుంకాలపై వైట్‌హౌస్‌ వర్గాల వెల్లడి

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 2: తమదేశంపై అధిక సుంకాలు విధిస్తున్న దేశాలన్నింటిపైనా ఏప్రిల్‌ 2న ప్రతీకార సుంకాలు విధిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నెలరోజులుగా హెచ్చరిస్తూ వస్తున్న నేపథ్యంలో.. ప్రపంచదేశాలన్నీ బుధవారం ఆయన చేసే ప్రకటన కోసం మునివేళ్లపై ఎదురుచూశాయి! మొత్తం అన్ని దేశాల దిగుమతులపైనా గంపగుత్తగా 20% సుంకం విధించే అవకాశం ఉందని కొన్ని కథనాలు రాగా.. తాము విధించబోయే సుంకాలు దేశాలు, రంగాలవారీగా ఉంటాయని వైట్‌హౌస్‌ వర్గాలు వెల్లడించినట్లు అమెరికన్‌ వార్తా సంస్థ ‘స్కై న్యూస్‌’ ఒక కథనంలో వెల్లడించింది. బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో (భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో) వైట్‌హౌస్‌లోని రోజ్‌గార్డెన్‌లో నిర్వహించే ఒక కార్యక్రమంలో.. ట్రంప్‌ ప్రతీకార సుంకాలపై ప్రకటన చేస్తారని, ఆ క్షణం నుంచే అవి అమల్లోకి వస్తాయని ఆ వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రతీకార సుంకాల ప్రభావం భారత్‌పై తీవ్రంగా పడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో.. వాటిపై పర్యవేక్షణకు, ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుని, ప్రభావాన్ని అంచనా వేసేందుకు భారతదేశం ఒక కంట్రోల్‌రూమ్‌ను ఏర్పాటు చేసింది. ఇతరదేశాలపై ఈ సుంకాల ప్రభావం.. వాటివల్ల భారత్‌కు ఏవైనా ప్రయోజనాలు కలిగే అవకాశం ఉందా అనే అంశాలను కూడా అధికారులు అక్కడి నుంచి అంచనా వేయనున్నారు.


ఇవి కూడా చదవండి:

Summer Icecream: వేసవిలో ఐస్ క్రీం తింటున్నారా లేదా ఫ్రోజెన్ డెజర్ట్ తింటున్నారా.. రెండింటికీ తేడా ఏమిటి..

AP Police Search For Kakani: హైదరాబాద్‌లోని కాకాణి నివాసానికి ఏపీ పోలీసులు..

Updated Date - Apr 03 , 2025 | 05:04 AM