Shravan Rao SIT Investigation: మరోసారి సిట్ విచారణకు శ్రవణ్ రావు
ABN , Publish Date - Apr 02 , 2025 | 12:43 PM
Shravan Rao SIT Investigation: ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావు మరోసారి సిట్ ముందు విచారణకు హాజరయ్యారు. ఈరోజు కూడా శ్రవణ్‌ను సుదీర్ఘంగా విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

హైదరాబాద్, ఏప్రిల్ 2: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) దర్యాప్తు కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు శ్రవణ్ రావు (Shravan Rao) వెళ్లారు. సిట్ విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే శ్రవణ్‌రావును ఆరున్నర గంటల పాటు పోలీసులు విచారించారు. ఈరోజు మరోసారి ఆయనను పోలీసులు ప్రశ్నించనున్నారు. గత శనివారం శ్రవణ్‌రావును సిట్ బృందం సుదీర్ఘంగా విచారించింది. ఆరున్నరగంటల పాటు విచారించిన సిట్.. శ్రవణ్ రావు నుంచి కొంత సమాచారాన్ని రాబట్టింది. అయితే ఆరోజు పోలీసుల విచారణకు శ్రవణ్ రావు సహకరించకపోవడం, పోలీసులు అడగిన ప్రశ్నలకు దాటవేత ధోరణి అవలంభించడంతో మరోసారి విచారించాలని సిట్ బృందం భావించింది. అందులో భాగంగానే మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో కాసేపటి క్రితమే సిట్ విచారణకు శ్రవణ్ రావు హాజరయ్యారు.
కాగా.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో శ్రవణ్ రావు చాలా కీలకంగా వ్యవహరించారని సిట్ బృందం భావిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు ఆరుగురు నిందితులు ఉండగా.. అందులో ఐదుగురు పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన వారే. కేవలం శ్రవణ్ రావు మాత్రమే ప్రైవేటు వ్యక్తి. అయితే పోలీసుశాఖ వ్యక్తులతో శ్రవణ్ రావు కుమక్కై ఏ విధంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిపించారనే దానిపై సిట్ బృందం ఫోకస్ చేసింది. కొంతమంది కాంటాక్ట్ లిస్టును శ్రవణ్ రావు సీఐబీ అధికారులకు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఎవరు ఈ కాంటాక్ట్ నెంబర్స్‌ను సమకూర్చారు, రాజకీయ నాయకులకు సంబంధించిన కాంటాక్ట్ వివరాలతో పాటు వారి సంభాషణలు వినాలని ఎవరు శ్రవణ్‌కు సూచించారు అనే అంశాలపైనే సిట్ బృందం ప్రధానంగా దృష్టి సారించింది. శాసనసభ ఎన్నికలకు ముందు సీఎం రేవంత్ రెడ్డికి చెందిన బంధువుల ఫోన్ నెంబర్లు సేకరించి.. వారి ఫోన్లపై కూడా నిఘా ఉంచినట్లు తెలుస్తోంది.
Kakani: మాజీ మంత్రి కాకాణి హైడ్రామా.. పోలీసులకు సవాళ్లు...
అలాగే ఫోన్ ట్యాపింగ్ చేసేందుకు ప్రత్యేకంగా పరికరాలను తీసుకొచ్చి, వాటిని వివిధ ప్రాంతాల్లో సర్వర్ రూంలుగా ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమంతా నడిపించారు. శ్రవణ్ రావుకు ఓ మీడియా సంస్థ ఉంది. ఆ మీడియా సంస్థ కార్యాలయంలోనే ప్రత్యేకంగా సర్వర్ రూంలను ఏర్పాటు చేసి.. అక్కడి నుంచే ఈ వ్యవహారాన్ని నడిపారు. ఈ వ్యవహారంలో శ్రవణ్ రావుకు ప్రణీత్ రావు సహకరించారు. ప్రణీత్ రావు నేతృత్వంలోనే శ్రవణ్‌రావుకు చెందిన కార్యాలయాల్లో ఫోన్ ట్యాపింగ్ పరికరాలను ఏర్పాటు చేసి.. అక్కడి నుంచే ఫోన్ ట్యాపింగ్‌కు తెరలేపారు. అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని నడిపించినందుకు శ్రవణ్ రావు ఏమైనా ఆర్థికంగా లబ్ధిపొందారా.. ఇదే నిజమైతే ఎవరు ఆయనకు ఆర్థికంగా మద్దతు ఇచ్చారు.. అన్న అంశాలపై సిట్ బృందం విచారించనుంది. గత విచారణలో వీటిపై శ్రవణ్‌ను ప్రశ్నించగా.. సరైన సమాధానాలు చెప్పనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మరోసారి శ్రవణ్‌కు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిపించిన సిట్.. ఆయన నుంచి పూర్తి సమాచారాన్ని రాబట్టే పనిలో పడ్డారు. ఈరోజు సాయంత్రం వరకు సుదీర్ఘంగా శ్రవణ్‌రావును సిట్ అధికారులు విచారించే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి
Rice: సన్నబియ్యం కోసం సందెవేళలోనూ..
Ameenpur Case Twist: అమీన్‌పూర్ కేసులో ట్విస్ట్.. బయటపడ్డ కన్నతల్లి బాగోతం
Read Latest Telangana News And Telugu News

జీవో 29పై సంచలన తీర్పు.. ఇక ఆ ఉద్యోగాలకు లైన్ క్లియర్..

కేటీఆర్‌కు షాకిచ్చిన కాంగ్రెస్ సర్కార్.. లెక్కలు తీస్తోందిగా..

రేషన్ కార్డుదారులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..

కాసేపట్లో మళ్ళీ భారీ వర్షాలు.. ఆ ప్రాంతాల వారికి బిగ్ అల్టర్

విజయ డెయిరీ సంచలన నిర్ణయం..
