HCU Professors On Land Issue: ఇందిర ఆశయాలు తుంగలోకి.. హెచ్‌సీయూ ప్రొఫెసర్లు సీరియస్
ABN , Publish Date - Apr 02 , 2025 | 12:42 PM
HCU: సంచలనంగా మారిన హెచ్‌సీయూ భూముల వ్యవహారంపై ఆ వర్సిటీ ప్రొఫెసర్లు స్పందించారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఆశయాలను తుంగలోకి తొక్కొద్దని కోరారు. వాళ్లు ఇంకా ఏమన్నారంటే..

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారం సంచలనంగా మారింది. ఈ ఇష్యూ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. యూనివర్సిటీ భూముల వేలం మీద అక్కడి విద్యార్థులతో పాటు ఇతర పార్టీల నాయకులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ భూములు తమవేనని సర్కారు చెబుతోంది. తాజాగా ఈ వ్యవహారంపై హెచ్‌సీయూ ప్రొఫెసర్లు స్పందించారు. యూనివర్సిటీ బాగు కోసం భూమిని ఇచ్చిన మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఆశయాలను తుంగలోకి తొక్కొద్దని ప్రొఫెసర్లు స్పష్టం చేశారు.
గతంలోనూ కుట్ర
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అప్పటి ప్రధాని ఇంధిరా గాంధీ యూనివర్సిటీకి ఎన్నో వేల ఎకరాలు ఇచ్చారని హెచ్‌సీయూ ప్రొఫెసర్లు తెలిపారు. అయితే ఇందిర వారసులమని చెప్పుకునే ప్రస్తుత కాంగ్రెస్ నేతలు.. ఆమె ఆశయాలను తుంగలోకి తొక్కుతున్నారని సీరియస్ అయ్యారు. గతంలో కూడా యూనివర్సిటీ భూములు దోచుకోవడానికి ఎంతో మంది కుట్రలు పన్నారని ఫైర్ అయ్యారు. భూముల్ని వేలం వేయడం వల్ల జీవరాశులతో పాటు జీవ వైవిధ్యానికి ఎంతో ఇబ్బంది కలుగుతుందని ప్రొఫెసర్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం భూముల వేలంపై మరోసారి ఆలోచించాలని చెప్పుకొచ్చారు. భూములను అకాడమిక్ పర్పస్‌లో మాత్రమే వాడుకోవాలని హెచ్‌సీయూ ప్రొఫెసర్లు రిక్వెస్ట్ చేశారు. భూముల కోసం టీచర్లు, నాన్ టీచింగ్ సిబ్బంది, విద్యార్థులు.. ఇలా అందరం కలసికట్టుగా పోరాడుతామని పేర్కొన్నారు.
ఇవీ చదవండి:
జగన్‌పై ఆగ్రహం.. ఉప్పల్ స్టేడియం ముట్టడి
వక్ఫ్‌బోర్డు బిల్లుకు మద్దతు ఇవ్వండి
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి