High Court: సీఎం రేవంత్‌రెడ్డికి హైకోర్టులో ఊరట
ABN , Publish Date - Mar 20 , 2025 | 05:11 AM
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. 2020లో నార్సింగి పోలీసులు ఆయనపై పెట్టిన డ్రోన్ ఎగరేసిన కేసును హైకోర్టు బుధవారం కొట్టివేసింది.

జన్వాడ ఫాంహౌ్‌సపై డ్రోన్ కేసు కొట్టివేత
ఆ ప్రాంతం నిషేధిత జాబితాలో లేదని వెల్లడి
సీఎంపై అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో కేటీఆర్‌పై కేసు కొట్టివేత
హైదరాబాద్, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. 2020లో నార్సింగి పోలీసులు ఆయనపై పెట్టిన డ్రోన్ ఎగరేసిన కేసును హైకోర్టు బుధవారం కొట్టివేసింది. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మంత్రి కేటీఆర్‌కు చెందినదిగా పేర్కొంటున్న జన్వాడ ఫాంహౌస్‌పై అప్పటి మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి డ్రోన్ ఎగరేయడంతోపాటు ఫొటోలు తీశారని.. వాటిని ప్రింట్ చేసి, మీడియాకు అందజేశారనే ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో కొన్నిరోజులపాటు రేవంత్‌రెడ్డి జైలులో రిమాండ్‌లో ఉన్నారు. తప్పుడు ఆరోపణలతో పెట్టిన ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ రేవంత్‌రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై జస్టిస్ కె.లక్ష్మణ్ ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలను నమోదు చేసుకున్న ధర్మాసనం.. డ్రోన్ ఎగరేసిన చోటు నిషేధిత ప్రాంతమని చెప్పడానికి ఆధారాలు లేవని.. దర్యాప్తు సందర్భంగా పోలీసులు చేర్చిన అదనపు సెక్షన్లు కూడా కేసును నిరూపించేవిగా లేవని వ్యాఖ్యానించింది. ఈ మేరకు నార్సింగ్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.