Share News

CM Revanth Reddy: సీఎం రేవంత్‌ రెడ్డి ఫొటోలు మార్ఫింగ్‌

ABN , Publish Date - Apr 04 , 2025 | 04:32 AM

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్‌ చేసి ఫేస్‌బుక్‌లో ప్రచారం చేస్తున్న వారిపై తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎ్‌సబీ) పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు.

CM Revanth Reddy: సీఎం రేవంత్‌ రెడ్డి ఫొటోలు మార్ఫింగ్‌

  • బీఆర్‌ఎ్‌సపై సందేహం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు

  • ఐటీ యాక్ట్‌ కింద కేసు నమోదు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్‌ చేసి ఫేస్‌బుక్‌లో ప్రచారం చేస్తున్న వారిపై తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎ్‌సబీ) పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. తెలంగాణ మత్స్యశాఖ కొ-ఆపరేటీవ్‌ సొసైటీ ఫెడరేషన్‌ చైర్మన్‌ మెట్టు సాయి కుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఎ్‌సబీ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


సీఎం రేవంత్‌ రెడ్డి ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్‌ చేసి ఫేస్‌బుక్‌లో పోస్టు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సాయి కుమార్‌ పోలీసులను కోరారు.

Updated Date - Apr 04 , 2025 | 04:32 AM