తాగునీటి సమస్య పరిష్కరించాలని.. ఖాళీ బిందెలతో నిరసన
ABN , Publish Date - Apr 01 , 2025 | 11:10 PM
మండలంలోని వడాల గ్రామంలోని ఎస్సీ కాలనీ వాసులు తాగునీటి సమస్యను పరిష్కరించాలని మంగళ వా రం ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు.

భీమిని, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని వడాల గ్రామంలోని ఎస్సీ కాలనీ వాసులు తాగునీటి సమస్యను పరిష్కరించాలని మంగళ వా రం ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజా ప్రతిని ధులకు ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నెల రోజులుగా నీటి కోసం నానా ఇబ్బందులు పడుతున్నామని, మిషన్ భగీరథ ట్యాంక్‌కు విద్యుత్ కనెక్షన్ లేదని, నీరు ట్యాంకు లోనికి ఎక్కడం లేదని వివిధ కారణాల సాకులతో కాలాయాపన చేస్తున్నారని మండి పడ్డారు. నీటి కోసం చేతిపంపుల వద్దకు వెళ్తున్నామని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మిషన్ భగీరథ ట్యాంకుకు విద్యుత్ క నెక్షన్ ఇచ్చి తమ కాలనీకి నీరు సరఫరా చేయాలని వారు కోరారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు.