Share News

TG Budget 2025: వైద్యానికి పెద్దపీట

ABN , Publish Date - Mar 20 , 2025 | 05:03 AM

వైద్యఆరోగ్య శాఖకు బడ్జెట్‌లో సర్కారు పెద్దపీట వేసింది. నర్సింగ్‌, వైద్య కళాశాలల నిర్మాణం, బోధనాస్పత్రుల అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చింది. ఆయా విభాగాల కోసం రూ.1024 కోట్లు కేటాయించింది.

TG Budget 2025: వైద్యానికి  పెద్దపీట

హైదరాబాద్‌, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): వైద్యఆరోగ్య శాఖకు బడ్జెట్‌లో సర్కారు పెద్దపీట వేసింది. నర్సింగ్‌, వైద్య కళాశాలల నిర్మాణం, బోధనాస్పత్రుల అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చింది. ఆయా విభాగాల కోసం రూ.1024 కోట్లు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ సారి బడ్జెట్‌లో రూ.12,393 కోట్లు కేటాయించింది. గత ఏడాది రూ.11,468 కోట్లు కేటాయించగా, అదనంగా రూ.925 కోట్లు పెంచింది. మొత్తం బడ్జెట్‌లో వైద్యఆరోగ్య రంగానికి సర్కారు 4.06ు నిధులను కేటాయించింది. ఇందులో నిర్వహణ వ్యయం కింద రూ. రూ.5667 కోట్లు, ప్రగతి పద్దు (జీతభత్యాలు మినహా అభివృద్ధి పనులకు కేటాయించే మొత్తాన్ని ప్రగతి పద్దు కింద పరిగణిస్తారు) కింద రూ.6726 కోట్లు కేటాయించింది. గత ఏడాది రాజీవ్‌ ఆరోగ్యశ్రీకి రూ.1065 కోట్లు కేటాయించగా.. ప్రస్తుత బడ్జెట్‌లో రూ.1143 కోట్లకు పెంచారు. అదనంగా రూ.78 కోట్లు చేర్చారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద రూ.580 కోట్లు కేటాయించారు. ఇందులో పెన్షనర్లకు రూ.150 కోట్లు, జర్నలిస్టుల ఆరోగ్య పథకం కింద రూ.45 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌లో న్యూట్రియంట్‌ కిట్స్‌కు నిధులివ్వలేదు. కానీ ఈసారి రూ.167 కోట్లు కేటాయించింది.


ప్రగతి పద్దు కింద కేటాయింపులు..

వైద్యవిద్య సంచాలకుల (డీఎంఈ) పరిధిలోని ఆస్పత్రుల అభివృద్ధి, అవసరమైన పరికరాలుుఽ పరీక్షలు నిర్వహించే యంత్రాల కొనుగోలు తదితరాల కోసం రూ.3010 కోట్లు కేటాయించారు. వైద్య విధాన పరిషత్‌ ఆస్పత్రుల అప్‌గ్రేడేషన్‌ కోసం రూ.164 కోట్లు, టీవీవీపీ ఆస్పత్రుల్లో సర్జికల్స్‌, ఎక్వి్‌పమెంట్స్‌, రీజెంట్స్‌ కొనుగోలు కోసం రూ.100 కోట్లు, ఈ హాస్పిటల్స్‌లో శానిటేషన్‌, సెక్యూరిటీ,పెషంట్‌ కేర్‌ సర్వీస్‌ కోసం రూ.116 కోట్లు కేటాయించారు. ఎంఎన్‌జే అభివృద్ధికి రూ.60 కోట్లు, ఎంఎన్‌జే అంకాలజీ ఇన్‌స్టిట్యూట్‌ ప్రాంతీయ క్యాన్సర్‌ కేంద్ర భవన నిర్మాణానికి రూ.4 కోట్లు కేటాయించారు. నిమ్స్‌ ఆస్పత్రికి రూ.27 కోట్లు ఇచ్చారు. జీహెచ్‌ఎంసీ పరిఽధిలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల సహాయకులకు సబ్సిడీ ఆహారాన్ని అందించేందుకు రూ. 169 కోట్లు కేటాయించారు. నూతన వైద్య కళాశాలల నిర్మాణం కోసం రూ.565 కోట్లు, డీఎంఈ పరిధిలోని ఆస్పత్రుల్లో డయాగ్నస్టిక్‌ పరికరాలు, డయాగ్నస్టిక్‌ రియెజెన్స్‌ డిస్పోజబుల్‌, శస్త్ర చికిత్సల కోసం అవసరమైన పరికరాల కొనుగోలు కోసం రూ.360 కోట్లు, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటు కోసం రూ.272 కోట్లు కేటాయించారు.

Updated Date - Mar 20 , 2025 | 05:03 AM