Share News

ఘనంగా రంజాన్‌

ABN , Publish Date - Apr 01 , 2025 | 12:47 AM

పవిత్ర రంజాన్‌ను పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా ముస్లింలు ప్రార్థనలు నిర్వహించారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌జిల్లా కేంద్రంలోని మంచి నీళ్ల బావి వద్ద ఉన్న ఈద్గా వద్ద ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుని రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు.

ఘనంగా రంజాన్‌
జగిత్యాలలో రంజాన్‌ వేడుకల్లో ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌

జగిత్యాల అర్బన్‌, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): పవిత్ర రంజాన్‌ను పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా ముస్లింలు ప్రార్థనలు నిర్వహించారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌జిల్లా కేంద్రంలోని మంచి నీళ్ల బావి వద్ద ఉన్న ఈద్గా వద్ద ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుని రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్ర మంలో మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ అడువాల జ్యోతి, గోళి శ్రీనివాస్‌, అడువాల లక్ష్మణ్‌, బాలె శంకర్‌, బద్దం, క్యాదా సు నాగయ్య, జగన్మోహన్‌ రెడ్డి, పంబాల రాంకుమార్‌, శరత్‌ రావు దూమాల రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు.

ఫ పట్టణంలోని కిలా గడ్డలో ఉన్న ఈద్గా వద్ద మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రెడి ముస్లింలకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట టీపీసీసీ కార్యదర్శి బండ శంకర్‌, గాజుల రాజేందర్‌, కొత్త మోహన్‌ పాల్గొన్నారు.

కోరుట్ల: రంజాన్‌ పురస్కరించుకుని కోరుట్ల పట్టణంలోని ఈద్గా వద్ద ముస్లింలు ప్రార్థనలు నిర్వహిం చారు. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు జువ్వాడి కృష్ణారావు వేరువేరుగా వారి పార్టీ నాయకులతో కలిసి ఈద్గాతో పాటు పట్టణంలోని పలు మసీదుల వద్ద ముస్లింలను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

కోరుట్ల రూరల్‌ : మండలంలోని ఆయా గ్రామాలలో గురువారం రంజాన్‌ పర్వదినం పురస్కరించుకుని ముస్లిం సోదరులు వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండలంలోని అయిలాపూర్‌ గ్రామంలోని ఈగ్దా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించంగా బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

హిందూ ముస్లింలు సోదరాభావంతో మొలుగాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ అన్నారు. మత సామరస్యానికి కోరుట్ల పట్టణం ప్రతీక అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్‌ మాజీ సర్పంచ్‌, సర్పంచ్‌ల ఫోరం జిల్లా అధ్యక్షుడు దారిశెట్టి రాజేష్‌ బీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సోదర భావంతో మెదిలి కోరుట్ల పట్టణంను అభివృద్ధి పథంలో నిలుపాలన్నారు. మున్సిపల్‌ మాజీ చైర్మెన్‌ శీలం వేణు గోపాల్‌, మాజీ కౌన్సిలర్ల్‌ ఎంబేరి నాగభూషణం, గుండోజీ శ్రీనివాస్‌ నాయకులు అన్నం అనిల్‌ కుమార్‌, అడెపు మధు, పుప్పాల ప్రభాకర్‌, నేమూరి భూమయ్య, తిరు మల గంగాధర్‌, కొంతం రాజం, బాజన్నలతో పాటు పలువురు పాల్గొన్నారు. మెట్‌పల్లి డీఎస్పీ అడ్డురి రాములు పర్యవేక్షణలో కోరుట్ల సీఐ సురేష్‌ బాబు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

Updated Date - Apr 01 , 2025 | 12:47 AM