Share News

CM Revanth Reddy: హైదరాబాదీలకు శుభవార్త.. ఏంటంటే..

ABN , Publish Date - Jan 03 , 2025 | 05:24 PM

CM Revanth Reddy: హైదరాబాద్ మంచినీటి కొరత తీర్చేందుకు గతంలో సిద్ధం చేసిన 15 టీఎంసీల ప్రతిపాదనలను 20 టీఎంసీలకు పెంచేలా సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం మంజీరా పైప్‌లైన్‌కు అదనంగా ప్రత్యామ్నాయ పైప్‌లైన్‌ నిర్మాణం చేయనున్నారు.

CM Revanth Reddy: హైదరాబాదీలకు శుభవార్త.. ఏంటంటే..
CM Revanth Reddy

హైదరాబాద్: ఇంటిగ్రేటేడ్​ కమాండ్​ కంట్రోల్​ సెంటర్‌లో హైదరాబాద్​ జల మండలి బోర్డుతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ(శుక్రవారం) భేటీ అయ్యారు. ఈ సమావేశానికి సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. వచ్చే వేసవిని దృష్టిలో ఉంచుకుని మంచినీటి సరఫరాకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. హైదరాబాద్ మహానగరంలో వినియోగదారులకు సమర్థవంతంగా మంచినీటి సరఫరా చేసే ప్రణాళికలపై మాట్లాడారు. గోదావరి ఫేజ్ 2 ప్రాజెక్టుకు మల్లన్న సాగర్ నుంచా లేక కొండపోచమ్మ సాగర్ నుంచి నీళ్లు తీసుకురావాలా అనే అంశంపై చర్చించారు. మల్లన్న సాగర్ నుంచే హైదరాబాద్ మంచినీటి సరఫరా ప్రాజెక్టును చేపట్టాలని ఈ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.


హైదరాబాద్ మంచినీటి కొరత తీర్చేందుకు గతంలో సిద్ధం చేసిన 15 టీఎంసీల ప్రతిపాదనలను 20 టీఎంసీలకు పెంచేలా నిర్ణయం తీసుకున్నారు. మంజీరా పైప్‌లైన్‌కు అదనంగా ప్రత్యామ్నాయ పైప్‌లైన్‌ నిర్మాణం చేయనున్నారు. జలమండలి ఆదాయ వ్యయాల నివేదికలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి జలమండలి ఎండీ అశోక్ రెడ్డి వివరించారు. జలమండలి కొత్త ప్రాజెక్టులకు తక్కువ వడ్డీలతో రుణాలు తెచ్చుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. మంజీరా నుంచి పాత పైప్ లైన్ పక్కనే కొత్త పైపులైన్ ప్రాజెక్ట్ పనులు చేపట్టాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. జల జీవన్ మిషన్ ద్వారా నిధులను తెచ్చుకోవడానికి వీలుగా ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. 25 ఏళ్ల భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా ప్రణాళికలు తయారు చేయాలని అన్నారు. ఇంటింటికీ తాగునీటితోపాటు సివరేజ్ ప్లాన్ తయారు చేయాలని అన్నారు. సివరేజ్ ప్లాన్‌పై కన్సల్టెన్సీలతో అధ్యయనం చేయించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

MLC Kavitha: కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను అమలు చేయాల్సిందే: ఎమ్మెల్సీ కవిత డిమాండ్..

Bhatti Vikramarka: ఆ ఘనత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకే దక్కుతుంది: డిప్యూటీ సీఎం భట్టి..

TG News: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఈ విషయం తెలుసుకుంటే ఎగిరి గంతేస్తారు..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 03 , 2025 | 05:25 PM