Share News

Crime News: అమ్మ ఎక్కడా అని అడిగితే నాన్న మౌనం.. గురుమూర్తి కుమార్తె స్టేట్‌మెంట్..

ABN , Publish Date - Jan 24 , 2025 | 07:44 AM

తన భార్య మాధవిని హత్య చేసిన ఘటనలో భర్త గురుమూర్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ క్రమంలో గురుమూర్తి కుమార్తె స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డు చేశారు. "అమ్మ ఎక్కడా అని అడిగితే నాన్న మౌనం గా ఉన్నాడు" అని తెలిపింది.

Crime News: అమ్మ ఎక్కడా అని అడిగితే  నాన్న మౌనం.. గురుమూర్తి కుమార్తె స్టేట్‌మెంట్..

హైదరాబాద్: భార్యపై అనుమానంతో హత్యచేసి.. ముక్కలుగా కోసి.. ఉడకబెట్టి, ఎండబెట్టి.. దంచి పొడి చేసి చెరువులో కలిపేసాడు. ఈ కేసులో (Murder Case) మృతిరాలి భర్త గురుమూర్తిని (Gurumurthy) పోలీసులు (Police) అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతని పిల్లల స్టేట్‌మెంట్ (Statement) కూడా పోలీసులు రికార్డు చేశారు. సంక్రాంతి పండుగ తరువాత ఇంట్లో కి రాగానే దారుణమైన వాసన వచ్చిందని గురుమూర్తి కూతురు చెప్పింది. "అమ్మ ఎక్కడా అని అడిగితే నాన్న మౌనం గా ఉన్నాడు" అని తెలిపింది. కాగా తన భార్య మాధవిని హత్య చేశానని పోలీసుల ముందు గురుమూర్తి ఒప్పుకున్నాడు. చంపిన విధానంపై పోలీసులకు 2,3 వెర్షన్స్ చెబుతున్నాడు. ఇంట్లోని బాత్ రూమ్‌లోనే మాధవి మృతదేహాన్ని కత్తితో ముక్కలు ముక్కలు చేశానని, రక్తపు మరకలు కనిపించకుండా 10 సార్లు కడిగానని గురుమూర్తి పొంతనలేని సమాధానాలతో పోలీసులు తలపట్టుకుంటున్నారు. గురువారం రాత్రి గురుమూర్తిని పోలీసులు మరోసారి చెరువు దగ్గరకి తీసుకెల్లారు.అయితే మాధవి ఆనవాళ్లు చెరువులో లభ్యం కాలేదు.

ఈ వార్త కూడా చదవండి..

భీమిలిలో హనీ ట్రాప్ కలకలం..


నేనే చంపాను.. మీ వద్ద సాక్ష్యాలున్నాయా..

కాగా ‘‘ నా భార్యను నేనే చంపాను.. మరి.. మీ వద్ద సాక్ష్యాలున్నాయా.. నాపై కేసు పెట్టి రిమాండ్‌ చేయండి.. అంతా కోర్టులోనే చూసుకుంటా’’.. విశ్వసనీయ సమాచారం ప్రకారం జిల్లెలగూడ కేసులో నిందితుడైన మాజీ జవాను గురుమూర్తి పోలీసులకు విసిరిన సవాలు ఇది.. ఇప్పుడు ఆ సాక్ష్యాలను వెతుకులాడే పనిలోనే పోలీసులు తలమునకలయ్యారు. భార్య వెంకట మాధవిని అతడు చంపింది నూటికి నూరుపాళ్లు వాస్తవం! మరి.. ఆ అవశేషాలు ఎక్కడ? కనీసం హత్య చేసినట్లుగా ఆనవాళ్లయినా కనిపించాలి కదా? అని పోలీసులు తలపట్టుకుంటున్నారు. అసలు.. గురుమూర్తి చెబుతున్నది వాస్తవమేనా? మృతదేహాన్ని ముక్కలుగా నరికి, ఉడికించి, వాటిని ఎండబెట్టి దంచి.. ఆ పొడిని చెరువులో కలివేసి ఉంటాడా? లేదూ.. తమను తప్పుదోవ పట్టించేందుకు అల్లిన కట్టుకథ కాదు కదా? విచారణలో గురుమూర్తి పొంతనలేని సమాధానాలు చెబుతుండటంతో పోలీసులు ఈ కోణంలోనూ ప్రశ్నలు వేసుకుంటున్నారు.

గురుమూర్తి ఉంటున్న ఇంటి నుంచి అవశేషాలను పడేసినట్లుగా చెబుతున్న జిల్లెలగూడ చెరువు వరకు ఉన్న అన్ని సీసీ కెమెరాల డీవీఆర్‌లనూ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జనవరి 16 నుంచి మాధవి కదలికలు ఎక్కడా కనిపించకపోవడంతో ఇంట్లోనే ఆమె హత్య జరిగి ఉంటుందని నిర్ధారణకు వచ్చారు. శరీర భాగాలను డ్రైనేజీలో వేశాడేమో అనే అనుమానంతో పోలీసులు బుధవారం పరిసర ప్రాంతాల్లోని అన్ని డ్రైనేజీ మ్యాన్‌ హోళ్లను తెరిపించి పరిశీలించారు. అయినా ఎలాంటి ఆధారాలు లభించలేదు. బుధవారం వరకు గురుమూర్తిని మీర్‌పేటలోనే పోలీసులు విచారించారు. విషయం బయటకు పొక్కడంతో అదే రోజు రాత్రి అతడిని ఓ రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి విచారణ జరుపుతున్నట్లు సమాచారం! గురువారం రాత్రి వరకు కూడా పోలీసులు ఈ కేసుకు సంబంధించి పెదవి విప్పకపోడం గమనార్హం..


వంటగదిలో మాంసం నరికే మొద్దు

భార్యను గురుమూర్తి ఇంట్లోనే హత్య చేసి ఉంటాడనే అనుమానాలకు బలం చేకూరేలా అతడు ఉంటున్న ఇంట్లోని వంటగదిలో మాంసం నరికే చెక్క మొద్దు కనిపించింది. గురుమూర్తి అద్దెకుంటున్న ఇంటి యజమాని, తన కుటుంబంతో కలిసి రెండు నెలల క్రితం బెంగళూరుకు వెళ్లినట్లు తెలిసింది. పోలీసులు ఆయన్ను పిలిపించి కొంత సమాచారం సేకరించినట్లు తెలిసింది. అనంతరం ఆయన మళ్లీ ఇంటికి తాళం వేసుకుని బెంగుళూరు వెళ్లిపోయారు. ఆ భవనం రెండో అంతస్తులోని ఓ పోర్షన్‌లో గురుమూర్తి కుటుంబం ఉంటోంది. ఆ ఇంటికి కూడా పోలీసులు తాళం వేశారు. అయితే వంటగది కిటికీలో నుంచి లోపలికి చూస్తే కిచెన్‌ ప్లాట్‌ఫామ్‌ మీద మాంసం నరికే చెక్క మొద్దు, పక్కన ఓ మద్యం బాటిల్‌, పళ్లెంలో చుడ్వా కనిపించాయి. ఓ సెల్ఫ్‌లో రెగ్యులర్‌గా వాడే చిన్న కుక్కర్‌ కనిపించింది. అయితే.. 50 కిలోలు ఉండే మనిషి మాంసాన్ని ఆ కుక్కర్‌లో ఉడికించడం సాధ్యమయ్యే పనేనా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైగా ఇంట్లో ఎలాంటి రక్తం మరకలు లేకపోవడం, వాసన కూడా రాకపోవడం పోలీసులను ఆలోచనలో పడేసింది. ఉడికించిన మాంసం ముక్కలతో పాటు ఎముకలను ఎండబెట్టినట్లుగా ప్రచారం జరగుతున్నప్పటికీ అక్కడ ఎండ ప్రసరించే ఛాయలే లేకపోవడంతో దీనికి బలం చేకూరడం లేదు. పోలీసులు ఏ ప్రశ్న అడిగినా గురుమూర్తి పొడిపొడిగానే సమాధానాలు చెబుతున్నట్లు సమాచారం.


ఈ వార్తలు కూడా చదవండి..

మహిళలకు గుడ్ న్యూస్..

గదుల్లోనూ గోల్‌మాల్‌ గోవిందా

దళిత ద్రోహి సునీల్‌కుమార్‌

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jan 24 , 2025 | 09:17 AM