Kishan Reddy: రేవంత్ సర్కార్‌పై కేంద్ర మంత్రి షాకింగ్ కామెంట్స్
ABN , Publish Date - Apr 15 , 2025 | 01:49 PM
Kishan Reddy: రేవంత్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. హైదరాబాద్ అభివృద్ధి కిషన్‌రెడ్డికి ఇష్టం లేదనే మాటలు చిల్లర మాటలు అని ధ్వజమెత్తారు. ఎవరైనా అభివృద్ధి జరగకూడదని అనుకుంటారా అని ప్రశ్నించారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో తాము గెలుస్తామనే నమ్మకం ఉందని కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

హైదరాబాద్: తెలంగాణలో భూముల అమ్మకాల ద్వారా పరిపాలన చేయాలని చూస్తున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మద్యం, భూములు అమ్మడం ద్వారా నిధులు రాబట్టి పరిపాలన చేయాలని రేవంత్ ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు. ఇంట్లో ఉన్న చెట్టు కొట్టాలన్న జీహెచ్‌ఎంసీలో పర్మిషన్ తీసుకోవాలని.. అలాంటి హెచ్‌సీయూలో చెట్లను ఎలా కొట్టారని ప్రశ్నించారు. రేవంత్ ప్రభుత్వం కన్జర్వేషన్ యాక్ట్‌ను ఉల్లంగించిందని అన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏ రాష్ట్రంలోనూ భూములు అమ్మలేదని స్పష్టం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నిక త్వరలో ఉంటుందని.. ఈ విషయంలో మీడియాకు ఎక్కువ ఆతృుత ఉందన్నారు. తమకు , తమ పార్టీ కార్యక్రమాలు అన్ని సమగ్రంగానే జరుగుతున్నాయని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.
సౌత్‌లో బలపడుతాం..
ఏఐడీఎంకేతో గతంలో బీజేపీకి పొత్తు ఉండేదని.. ఇప్పుడు దాని పునరుద్దరణ జరిగిందని కిషన్‌రెడ్డి గుర్తుచేశారు. అన్నామలైకి జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అవకాశం ఇస్తారని అన్నారు. నియోజకవర్గ పునర్విభజనపై మోదీ ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. బీజేపీకి సౌత్‌లో బలపడాలని ఉంటుంది కదా అని అన్నారు. తాము ఎందుకు సౌత్‌కు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటామని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ రంగాల సంస్థలను తాము బలోపేతం చేస్తున్నామని అన్నారు. బీఎస్ఎన్‌ఎల్, ఎల్‌ఐసీ , బ్యాంకింగ్ రంగాలను లాభాల్లోకి తీసుకువచ్చామని గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వం కూలిపోతే తమకు ఇప్పటికిప్పుడు ఏం వస్తోందని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు సరైన తీర్పు ఇస్తారని చెప్పారు. గుజరాత్ వ్యాపారులకు ఏం పనిలేదా... వారు ఎందుకు రేవంత్ ప్రభుత్వాన్ని కులుస్తారని ప్రశ్నించారు. బీసీల రిజర్వేషన్ పెంచాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తే బీజేపీ ఏ నిర్ణయం తీసుకోదని అన్నారు. బీజేపీ స్వతంత్ర ఆలోచనా చేస్తుందని.. తాము ఎప్పుడు నిర్ణయం తీసుకోవాలో అప్పుడు తీసుకుంటామని స్పష్టం చేశారు. వక్ఫ్‌చట్టన్ని వ్యతిరేకిస్తున్నారంటే భూ బకాసురులకు వత్తాసు పలకడమేనని కిషన్‌రెడ్డి చెప్పారు.
వక్ఫ్ చట్టంతో ముస్లింలకు న్యాయం..
వక్ఫ్ చట్టంతో పేద ముస్లింలకు న్యాయం తప్ప అన్యాయం జరగదని కిషన్‌రెడ్డి తేల్చిచెప్పారు. వక్ఫ్ బోర్డు తీసుకున్న నిర్ణయంపైన తాము కోర్టుకు వెళ్లే అవకాశం కల్పించామని అన్నారు. వక్ఫ్ చట్టం తెస్తామని తాము మేనిఫెస్టోలో పెట్టలేదన్నారు. ప్రజల ఆమోదంతో మూడోసారి అధికారంలోకి వచ్చామని.. మేనిఫెస్టో అమలు చేశామని గుర్తుచేశారు. అన్యాక్రాంతం అవుతున్న భూములను కాపాడటమే తమ లక్ష్యమని చెప్పారు. వక్ఫ్ భూములపైన అక్రమంగా లబ్ధి పొందిన వారే ఈ ధర్నాలు చేస్తున్నారని అన్నారు. వక్ఫ్ నుంచి ఆదాయం పెంచుతామని, వచ్చిన ఆదాయాన్ని వారికే పంచుతామని స్పష్టం చేశారు. దేవాలయాలకు, వక్ఫ్‌బోర్డుకు పోలిక లేదని... బోర్డులకు మసీదులపై సంబంధం లేదన్నారు. మసీదులకు వచ్చే ఆదాయం దేవాలయానికి వచ్చే ఆదాయంతో పోల్చాలని అన్నారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో తాము గెలుస్తామనే నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. ఓటర్లు ఏ పార్టీ వారైనా కలుస్తామని.. వారిని తమకు ఓటు వేయమని అడుగుతామని చెప్పారు. పాత బస్తీల్లో హిందువుల కాలనీలు స్లోగా ఖాళీ అవుతున్నాయని కిషన్‌రెడ్డి అన్నారు.
వారిని భయపెడుతున్నారు..
వారిని భయభ్రాంతులకు గురి చేసి అక్కడి నుంచి వెళ్లిపోయేలా కొంతమంది చేస్తున్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. పాత బస్తీకి పరిమితమైన ఎంఐఎం ఇప్పుడు న్యూ సిటీకి విస్తరిస్తోందని అన్నారు. ఎర్రగడ్డ, బోరబండ లాంటి ప్రాంతాల్లో ఎంఐఎం విస్తరిస్తోందని చెప్పారు. వీరికి కాంగ్రెస్, బీఆర్ఎస్ సహకరిస్తోందని ఆరోపించారు. ఎవరు అధికారంలో ఉంటే వారితో ఎంఐఎం నేతలు అంటకాగుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అయినా దాని బాసు మాత్రం అసదుద్దీన్ ఒవైసీనేనని.. అలాగే కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్‌గాంధీ అయిన దాని బాసు మాత్రం అసదుద్దీన్ ఒవైసీనే అని ఆరోపణలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ హెచ్‌సీయూ గురించి ఎక్కడ అనలేదని అన్నారు. హైదరాబాద్ అభివృద్ధి కిషన్‌రెడ్డికి ఇష్టం లేదనే మాటలు చిల్లర మాటలని ధ్వజమెత్తారు. ఎవరైనా అభివృద్ధి జరగకూడదని అనుకుంటారా అని ప్రశ్నించారు. రాజకీయంగా మాట్లాడే మాటలకు తాను ఏం సమాధానం చెబుతానని నిలదీశారు. అంబర్‌పేట, బీహెచ్‌ఈఎల్, శంషాబాద్ విమానాశ్రయం ఫ్లై ఓవర్లు తాను కేంద్రమంత్రిగా ఉండగానే పూర్తి అయ్యాయని గుర్తుచేశారు. త్వరలో నితిన్ గడ్కరీతో వీటిని ప్రారంభిస్తామని, మరికొన్ని నేషనల్ హైవేస్‌కు శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు. దేశం మొత్తం మీద ఎంఐఎంకు ఒక స్టాండ్ ఉందని, తెలంగాణకు మరో స్టాండ్ ఉంటుందని విమర్శించారు. దేశవ్యాప్తంగా అన్ని స్థానాల్లో తాము పోటీ చేస్తామని అన్నారు. ఇక్కడ బీజేపీ గెలవకుండా ఉండేందుకు ఎంఐఎం పోటీకి దూరంగా ఉంటుందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి బ్రాండ్ ఏంటో వచ్చే ఎన్నికల్లో ప్రజలు చెబుతారని కిషన్‌రెడ్డి అన్నారు.
సన్నబియ్యంపై క్లారిటీ..
‘నేషనల్ ఇజమే నా బ్రాండ్. ఎస్సీ , ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచే అధికారం రాష్ట్రాలకే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కేటగిరీలు చేస్తుంది. మేము తెలంగాణలో అధికారంలోకి వస్తే సింగరేణి కార్మికులకు టాక్స్ రీయింబర్స్‌మెంట్ ఇస్తాం. ఇప్పటికే ఇచ్చిన ట్యాక్స్ ఎగ్జామ్స్ వల్ల చాలామందికి లబ్ధి జరుగుతుంది. రేషన్ బియ్యం వద్ద ఇచ్చే రసీదు చూస్తే తెలుస్తుందని... ఎవరు ఎంత ఇస్తున్నారనేది. మేము ఇచ్చే 5కిలోలు కాకుండా అదనంగా సన్న బియ్యం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. గాలి మాటలు మాట్లాడటం కాదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేవి పాకిస్థాన్ నుంచో, నరేంద్ర మోదీ జేబులో నుంచో ఇవ్వట్లేదు. రేవంత్ రెడ్డి ఇచ్చేవి ఆయన జేబులో నుంచి ఇవ్వడం లేదు. ఎవరిచ్చిన ప్రజల కట్టె ట్యాక్స్ నుంచి ఇచ్చేవే. ప్రజలు కట్టె డబ్బులతోనే ప్రభుత్వాలు నడుస్తున్నాయి. రాష్ట్రం ప్రారంభించే ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేంత ఇస్తుంది.. మీరు అడిగినంత ఇస్తుంది. ఉత్తరం రాయగానే డబ్బులు ఇస్తుందా. కేంద్రం వద్ద ఏం మిగులు నిధులు లేవు’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Narendra Modi: తెలంగాణలో అడవులపైకి బుల్డోజర్లు
KTR: ఒక్కసారి ఓటేస్తే.. ఐదేళ్ల శిక్షగా మారింది!
Kishan Reddy: అంబేడ్కర్‌ను అవమానించిన నీచ చరిత్ర కాంగ్రెస్‌ది
Read Latest Telangana News And Telugu News