Share News

Minister Seethakka: రంగంలోకి మంత్రి సీతక్క.. ఆ టీచర్ల చర్చలు సఫలం

ABN , Publish Date - Jan 03 , 2025 | 05:35 PM

Minister Seethakka: గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్ల (CRT)తో మంత్రి సీతక్క చర్చలు సఫలం అయ్యాయి. మంత్రి సీతక్క విజ్ఞప్తి మేరకు సమ్మె విరమిస్తున్నట్లు కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్లు ప్రకటించారు. రేపటి నుంచి విధుల్లో చేరుతున్నట్లుగా కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్లు ప్రకటించారు.

 Minister Seethakka: రంగంలోకి మంత్రి సీతక్క.. ఆ టీచర్ల చర్చలు సఫలం
Minister Seethakka

హైదరాబాద్: గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్ల సమస్యలపై మంత్రి సీతక్క చర్చించారు. కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ల ప్రతినిధులతో మంత్రి సీతక్క సచివాలయంలోని తన పేషీలో ఇవాళ(శుక్రవారం) భేటీ అయ్యారు. పెండింగ్ సమస్యల పరిష్కారంపై చర్చించారు. ఈ సమావేశంలో మంత్రి సీతక్కతో పాటు గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి శరత్, అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్ల (CRT)తో మంత్రి సీతక్క చర్చలు సఫలం అయ్యాయి. మంత్రి సీతక్క విజ్ఞప్తి మేరకు సమ్మె విరమిస్తున్నట్లు కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్లు ప్రకటించారు. రేపటి నుంచి విధుల్లో చేరుతున్నట్లుగా కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్లు ప్రకటించారు. ఉద్యోగ క్రమబద్ధీకరణ, మినిమం టైం స్కేల్ మినహా అన్ని డిమాండ్లకు సానుకూలంగా ప్రభుత్వం స్పందించింది. ప్రతినెలా ఐదో తేదీ లోపు జీతాలు, మహిళా టీచర్లకు 108 రోజుల ప్రసూతి సెలవులు, డెత్ బెనిఫిట్స్ మంజూరు చేస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. ఉద్యోగ ప్రతీకరణ మినిమం టైం స్కేల్ డిమాండ్లపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో చర్చించి మరోసారి సమావేశం అవుదామని మంత్రి సీతక్క చెప్పారు. మంత్రి సీతక్కతో సమ్మె విరమిస్తున్నట్లు కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్లు ప్రకటించారు.


డీడబ్ల్యూలకు మంత్రి సీతక్క ఉద్బోద

‘‘మీరు మారండి.. సమాజాన్ని మార్చుదాం.. చిన్నారుల భవిష్యత్తును తీర్చిదిద్దుదాం’’ అని డీడబ్ల్యూలకు మంత్రి సీతక్క ఉద్బోదించారు. ప్రతి అంగన్వాడి కేంద్రాలకు బెల్స్ ప్రొవైడ్ చేయాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సమయానికి బడి గంట మోగించిన తరహాలోనే అంగన్వాడీ కేంద్రాల్లో ఉదయం 9 గంటలకు బెల్ మోగించాలని అన్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి జిల్లా సంక్షేమ అధికారులు టీచర్లు ఆయాలతో సమావేశాలు నిర్వహించి లోటుపాట్లపై నివేదికలు సమర్పించాలని అన్నారు. ఎక్కడ లోపాలు లేకుండా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా అంగన్వాడీ కేంద్రాలను తీర్చిదిద్దాలని అన్నారు. అంగన్వాడీ కేంద్రాలు కార్పొరేట్ ప్లే స్కూళ్లను మించిపోయేలా పని చేయాలన్నారు. ప్రైవేట్ స్కూళ్లలో ఎల్కేజీ యూకేజీకి లక్షలు వసూలు చేస్తున్నారని అన్నారు. అందుకే అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీ ప్రైమరీ పాఠాలను బోధిస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

MLC Kavitha: కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను అమలు చేయాల్సిందే: ఎమ్మెల్సీ కవిత డిమాండ్..

Bhatti Vikramarka: ఆ ఘనత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకే దక్కుతుంది: డిప్యూటీ సీఎం భట్టి..

TG News: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఈ విషయం తెలుసుకుంటే ఎగిరి గంతేస్తారు..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 03 , 2025 | 05:38 PM