LRS: ప్రజలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్
ABN , Publish Date - Apr 02 , 2025 | 05:39 PM
LRS: ఆర్థిక సంవత్సరం ప్రారంభం వేళ.. రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎల్ఆర్ఎస్ ఫీజు గడవును మరోమారు పోడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ మాసాంతం వరకు ఈ గడువును.. అది కూడా 25 శాతం రాయితీతో ఫీజు చెల్లించవచ్చని స్పష్టం చేసింది.

హైదరాబాద్,ఏప్రిల్ 02: తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లింపు గడువును ఈ మాసాంతానికి అంటే.. ఏప్రిల్ 30వ తేదీ వరకు పెంచుతూ ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకుంది. అసలు అయితే ఈ గడువు మార్చి 31వ తేదీతో పూర్తయింది. కానీ ఈ గడువును పెంచుతూ పురపాలక శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇక ఏప్రిల్ 30వ తేదీ వరకు ఎల్ఆర్ఎస్‌కు 25 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
మరోవైపు ఈ ఎల్ఆర్ఎస్ ప్రక్రియ ద్వారా ఇప్పటికే లే అవుట్లను క్రమబద్ధీకరణ చేసింది. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సుమారుగా రూ. 1000 కోట్లకు పైగా ఆదాయం సమకూరినట్లు సమాచారం. అలాగే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ మున్సిపాలిటీల పరిధిలో ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు 15.27 లక్షలు వచ్చాయి. వాటిలో 15,894 దరఖాస్తులను ప్రభుత్వాధికారులు తిరస్కరించారు. ఇక ప్రాసెస్ అయిన ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు 6. 87లక్షలు కాగా.. ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు రూ. 8.65 లక్షలు పెండింగ్‌లో ఉంది. వీటితో పాటు ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించిన దరఖాస్తులు 2.6 లక్షలు కాగా.. వాటికి సంబంధించి ప్రోసీడింగ్ ఇచ్చిన ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు 58, 032 ఉన్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి.
ఇక ఈ ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లింపు గడువును పెంచడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే.. ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ వివరాలను వెబ్‌సైట్ పోర్టల్‌లో పొందు పరిచింది. అయితే అందులోని ప్రభుత్వ ధరలకు.. బయట మార్కెట్ విలువకు పూర్తి వాస్తవ విరుద్దంగా ఉంది. అలాగే ఎల్ఆర్ఎస్ కోసం ప్రభుత్వం ఫోన్ నెంబర్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఆ నెంబర్ సైతం సక్రమంగా పని చేయడం లేదంటూ ప్రజల నుంచి ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి.
అలాగే వెబ్ సైట్ పోర్టల్‌లోని అంశాలపై ప్రభుత్వం దృష్టికి ప్రజలు తీసుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అదీకాక ఎల్ఆర్ఎస్ గడవు సమీపిస్తున్నా.. ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదంటూ పలువురు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయం ప్రభుత్వ దృష్టికి వెళ్లింది. అలాంటి వేళ.. ఎల్ఆర్ఎస్ ఫీజు గడువును మరో నెల రోజులు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించిన ఆదేశాలు జారీ చేసింది.
ఇవీ చదవండి:
ఇందిర ఆశయాలు తుంగలోకి.. ప్రొఫెసర్లు సీరియస్
జగన్‌పై ఆగ్రహం.. ఉప్పల్ స్టేడియం ముట్టడి
వక్ఫ్‌బోర్డు బిల్లుకు మద్దతు ఇవ్వండి
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి