Crime News: రంగారెడ్డి జిల్లా: అత్తాపూర్‌లో విషాదం..
ABN , Publish Date - Mar 29 , 2025 | 01:35 PM
ఏడాది క్రితం అమిష్ లోయా అనే వ్యక్తితో టాప్ మెహందీ ఆర్టిస్ట్ పింకి కోర్టు మ్యారేజ్ చేసుకున్నారు. ఆమె సూసైడ్ చేసుకున్నారు. అయితే కుటుంబ కలహాల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలియవచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. పింకీ ఆత్మహత్యకు తన భర్త వేధింపులు కారణమా లేదా వేరే ఏమైనా కారణమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

రంగారెడ్డి జిల్లా: రాజేంద్రనగర్ (Rajendranagar), అత్తాపూర్ (Attapur)లో విషాదం (Tragedy) నెలకొంది. హైదరాబాద్‌లో టాప్ మెహందీ ఆర్టిస్ట్ పింకీ (Top Mehndi Artist Pinky) చున్నీతో ఉరివేసుకొని (Suicide) బలవన్మరణానికి పాల్పడింది. స్థానికులు ఇచ్చిన సమాచారం అందుకున్న అత్తాపూర్ పోలీసులు (Police).. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని.. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. సంవత్సరం క్రితం అమిష్ లోయా అనే వ్యక్తితో పింకి కోర్టు మ్యారేజ్ చేసుకున్నారు. అయితే కుటుంబ కలహాల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలియవచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. పింకీ ఆత్మహత్యకు తన భర్త వేధింపులు కారణమా లేదా వేరే ఏమైనా కారణమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Also Read..: టీడీపీలో హిట్ పుట్టిస్తున్న కొలికపూడి ఎపిసోడ్..
మరో ఘటన.. న్యూస్ లైన్ నిర్వాహకుడు యూట్యూబర్ శంకర్‌పై అంబర్ పేట పోలీస స్టేషన్‌లో ఆత్యాచారం కేసు కేసు నమోదు అయింది. శంకర్ తనను ప్రేమ పెళ్లి పేరుతో మోసం చేశాడని, మాయ మాటలు చెప్పి అత్యాచారం చేశాడని ఓ మహిళ పిర్యాదు చేశారు. పెళ్లి చేసుకోమని అడిగినందుకు తనను బెదిరిస్తున్నాడంటూ ఆమె పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేసింది. దీంతో శంకర్‌పై 69, 79, 352, 351 (4) బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు శంకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టులో హాజరు పరుస్తారు.
కాగా నిజామాబాద్, ముబారక్ నగర్‌కు చెందిన బింగి కమల అనే మహిళ హత్య చేసుకుంది. పద్మ అనే మహిళతో గత 11 సంవత్సరాలుగా పరిచయం ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని పరస్థితిని సమీక్షించారు. మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పద్మ పెద్ద కుమారుడు కమలను కారులో తీసుకెళ్లి హత్య చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. కమల మెడలో ఉన్న బంగారం దొంగిలించడానికి హత్య చేసినట్టు ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. దాస్ నగర్ చెరువు దగ్గరలో ఉన్న చెట్ల పొదల్లో డెడ్ బాడీ దొరికింది. గొడ్డలితో నరికినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతురాలికి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు. పోీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
మయన్మార్‌కు భారత్ ఆపన్నహస్తం..
కార్యకర్తలకు, నాయకులకు సెల్యూట్ చేస్తున్నా...
నాగర్‌కర్నూల్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం
For More AP News and Telugu News