Rash Driving: మద్యం మత్తులో యువతుల హల్చల్.. నడి రోడ్డుపై ఏం చేశారంటే..
ABN , Publish Date - Mar 07 , 2025 | 09:21 AM
Rash Driving: మద్యం మత్తులో యువతులు రెచ్చిపోయారు. రాష్ డ్రెవింగ్ చేసి వాహనదారులను ఢీకొట్టారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో చోటుచేసుకుంది. వాహనదారులు ఫిర్యాదు చేయడంతో యువతులపై ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు.

హైదరాబాద్: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో మద్యం మత్తులో కారు నడుపుతూ యువతులు బీభత్సం సృష్టించారు. ద్విచక్ర వాహనదారులను కారుతో ఢీ కొట్టారు. మద్యం మత్తులో యువతులు నడిరోడ్డుపై నానా హంగామా చేశారు. కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్ వద్ద ద్విచక్ర వాహన దారుడిని కారుతో ఢీకొట్టారు. ఢీ కొట్టడమే కాక బైక్ వాహనదారుడిని యువతులు బెదిరించారు. దీంతో ట్రాఫిక్ పోలీసులను ద్విచక్ర వాహనదారుడు ఆశ్రయించాడు. సదరు యువతులపై ఆయన ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు డ్రంకన్ డ్రైవ్ టెస్ట్ చేయగా రీడింగ్ 212 పాయింట్లు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. యువతులు మద్యం సేవించినట్లుగా పోలీసులు గుర్తించారు. కారులో బీర్ టిన్నులు సైతం దొరకడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువతులు ఎక్కడికి వెళ్తున్నారనే విషయంపై పోలీసులు ఆరా తీశారు.
ఈ వార్తలు కూడా చదవండి
TG Govt: కార్మికుల ఆచూకీ కోసం క్యాండీవర్ శునకాలు!
Read Latest Telangana News And Telugu News