విద్యుత్ సమస్యలు ఏకరువు..
ABN , Publish Date - Mar 19 , 2025 | 01:04 AM
సెస్ విని యోగ దారులకు సేవలందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. గ్రామాల్లో ట్రాన్స్‌ఫార్మర్లు, లూజ్ వైర్లు, సెస్‌లో అవినీతి, బ్యాక్ బిల్లింగ్‌లతో పరిశ్ర మలకు ఇబ్బందులు వంటి సమస్యలతో వినియో గదారులు ధ్వజమెత్తారు.

సిరిసిల్ల, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): సెస్ విని యోగ దారులకు సేవలందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. గ్రామాల్లో ట్రాన్స్‌ఫార్మర్లు, లూజ్ వైర్లు, సెస్‌లో అవినీతి, బ్యాక్ బిల్లింగ్‌లతో పరిశ్ర మలకు ఇబ్బందులు వంటి సమస్యలతో వినియో గదారులు ధ్వజమెత్తారు. మంగళ వారం సిరిసిల్ల పద్మనాయక కళ్యాణ మండపంలో సిరిసిల్ల సహ కార విద్యుత్ సరఫరా సంఘం పరిధిలో 2025- 26 వార్షిక ఆదాయ ఆవశ్యకత ఛార్జీల నుంచి అంచనా ఆదాయంపై తెలంగాణ విద్యుత్ నియం త్రణ మండలి చైర్మన్ డాక్టర్ జస్టిస్ బి నాగార్జున్ బహిరంగ విచారణ నిర్వహించారు. సిరిసిల్ల సెస్ పరిధిలో విద్యు త్ సరఫరా ఆదాయ నివేదికను సెస్ ఎండీ విజయేం దర్‌రెడ్డి వివరించారు. అనంతరం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వినియోగదారులు, సంఘాల ప్రతినిధులు కాసా శశిభూషణ్, బియ్యంకార్ శ్రీనివాస్, సిరిసిల్ల రవీందర్, సర్వయ్య, గుంటుక మహేష్, య శ్వంత్‌రెడ్డి, వంశీకృష్ణరావు, ఓరుగంటి రామకృష్ణ, గౌడ వాసు, కొండ ప్రతాప్, పెద్దన్న, గోనె ఎల్లప్ప, పబ్బ నాగరాజు, గరిపెల్లి ప్రభాకర్, పులి లక్ష్మీపతిగౌడ్, నిర్మల, జోగినిపల్లి సంపత్‌రావు, దేవ య్య తదితరులు విద్యుత్ సమస్యలను ఏకరువుపెట్టారు. వివిధ సమస్యలను జస్టిస్ దృష్టికి తీసుకెళ్లారు. విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ డాక్టర్, జస్టిస్ బి నాగార్జున్ మాట్లాడుతూ సెస్ పరిధిలో ప్రమాదాలు జరుగుతున్నా వాటిపై రైతులకు వినియోగదారులకు అవగాహన కల్పి స్తున్న ప్రణాళిక ఏదీ అని టీజీఈఆర్‌సీ చైర్మన్ డాక్టర్, జస్టిస్ బి నాగార్జున్ అడిగారు. సెస్ టోల్ ఫ్రీ నెంబర్ మోగడం లేదన్నారు. ప్రమాదాలు 8 వరకు జరిగాయని సెస్ పరిధి లో ఎన్ని రోజులు అవగాహనలు కల్పిస్తున్నారు, కరపత్రాలు వేస్తున్న దానిపై నివేదిక ఇవ్వాలని సూచించారు. విద్యుత్ సమస్యలపై చర్యలు తీసు కుంటామని తెలిపారు.