అభివృద్ధి, సంక్షేమానికి పెద్ద పీట
ABN , Publish Date - Mar 20 , 2025 | 01:44 AM
పెద్దపల్లి, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక శాఖ, ఉప ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజారంజకంగా ఉందని, ఎన్నికల సందర్భం గా ఇచ్చిన హామీలను నెరవేరుస్తూనే, అభివృద్ధి పనులకు తగిన కేటాయింపులు చేశారని, ఇది అందరికీ అమోద యోగ్యంగా ఉంటుందని అధికార పక్ష నేతలు అంటుండగా, 420 హామీలను మరిచిం దని, ఎన్నికల హామీల ప్రస్తావన అంకెల్లోనే ఉంది తప్ప ఆచరణీయం కాదని, అంకెల గారడీని తలపిస్తున్నదని ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు విమర్శిస్తున్నారు.

పెద్దపల్లి, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక శాఖ, ఉప ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజారంజకంగా ఉందని, ఎన్నికల సందర్భం గా ఇచ్చిన హామీలను నెరవేరుస్తూనే, అభివృద్ధి పనులకు తగిన కేటాయింపులు చేశారని, ఇది అందరికీ అమోద యోగ్యంగా ఉంటుందని అధికార పక్ష నేతలు అంటుండగా, 420 హామీలను మరిచిం దని, ఎన్నికల హామీల ప్రస్తావన అంకెల్లోనే ఉంది తప్ప ఆచరణీయం కాదని, అంకెల గారడీని తలపిస్తున్నదని ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు విమర్శిస్తున్నారు. బుధవారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క రూ. 3,04,965 కోట్ల రూపాయలతో బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేసేందుకు ప్రత్యేకిం చి రూ.56,084 కోట్లు కేటాయించడం గమనార్హం. ఇందులో రైతు భరోసాకు రూ.18 వేల కోట్లు, ఇంది రమ్మ ఇళ్లకు రూ. 12,571 కోట్లు, చేయూత పథకా నికి రూ. 14,861 కోట్లు, గృహజ్యోతి పథకానికి రూ. 2,080 కోట్లు, మహాలక్ష్మి పథకానికి రూ. 4,305 కోట్లు, సబ్సిడీ గ్యాస్ రూ. 723 కోట్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి రూ. 600 కోట్లు, యువ వికాసం పథకానికి రూ. 6 వేల కోట్లు, సన్నాలకు బోనస్ రూ.1800 కోట్లు కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి కూడా తగిన విధంగా నిధులు కేటాయించారు. నీటి పారుదల రంగానికి రూ. 23,373 కోట్లు, వ్యవసాయ రంగానికి రూ. 24,439 కోట్లు, విద్యా రంగానికి రూ. 23,108 కోట్లు కేటాయించారు. చేయూత పథకానికి గతంలో కంటే కాస్త ఎక్కువ నిధులు కేటాయించడం వల్ల ప్రస్తు తం ఇస్తున్న రూ. 2 వేల పింఛన్లను పెంచే అవకాశాలు ఉన్నాయి.
ఫ అన్ని వర్గాలకు సమ న్యాయం
- చింతకుంట విజయరమణారావు, పెద్దపల్లి ఎమ్మెల్యే
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలకు సమ న్యాయం చేసే విధంగా ఉంది. వ్యవసాయానికి, మహిళలకు, ఆరు గ్యారంటీ పథకాలకు పెద్ద పీట వేయడంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు పెద్ద పీఠ వేశా రు. యువ వికాసం పేరిట 6 లక్షల మంది నిరుద్యో గులకు లబ్ధి చేకూర్చేలా బడ్జెట్ ఉంది. ఇందిరమ్మ ఇళ్లకు కూడా నిధులు పెద్ద ఎత్తున కేటాయించడం శుభసూచకం. ఈ బడ్జెట్‌తో ప్రతిపక్షాల నోర్లు మూత పడడం ఖాయం.
ఫ ప్రజా రంజక, ప్రజాపాలన బడ్జెట్
- రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్, రామగుండం ఎమ్మెల్యే
ప్రభుత్వం తీసుక వచ్చిన 2025-26 బడ్జెట్ ప్రజా రంజక, ప్రజాపాలన బడ్జెట్. కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా, ప్రభుత్వం కష్టకాలంలో ఉన్నా కూడా రాష్ట్ర భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని 3 లక్షల కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అన్ని వర్గాల ప్రజలకు పెద్దపీట వేశారు. ఉద్యోగాల కల్పన, నీటి పారుదల, విద్యుత్, వ్యవసాయ, విద్య, వైద్య రంగా నికి సరిపడా నిధులు కేటాయించారు. 2050 మెగా మాస్టర్ ప్లాన్‌ను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్‌ను రూపొందించారు. రామగుండంలో 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు కూడా అడుగులు పడుతున్నాయి.
ఫ 420 హామీల ప్రస్తావన ఏదీ..
- కోరుకంటి చందర్, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే
ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీల ప్రస్తావన బడ్జెట్‌లో లేదు. గత బడ్జెట్‌లో ఆయా శాఖలకు కేటాయించిన నిధులనే వెచ్చించ లేదు. 3 లక్షల కోట్ల బడ్జెట్ అంకెల గారడీ బడ్జెట్టే. ఆడపిల్లల పెళ్లిళ్లకు తులం బంగారం, స్కూటీలు, నిరుద్యోగ భృతి, మహిళలకు నెలకు రూ. 2500, పింఛన్ల పెంపు అంశాలు బడ్జెట్‌లో కానరావడం లేదు. ప్రజలను మోసం చేసే విధంగా బడ్జెట్ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వ పని తీరుపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు.
ఫ బడాయి బడ్జెట్.. కాగితాలకే పరిమితం..
- కర్రె సంజీవరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఉత్త బడా యి బడ్జెట్. అందులో పస లేదు. అది కాగితాలకే పరిమితం కానున్నది. ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా లేదు. నిరుద్యోగ భృతి లేదు, తులం బంగారం లేదు. పింఛన్లు పెరగ లేదు. ఉచిత హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో రోజు రోజుకు విశ్వాసం సన్న గిల్లుతున్నది. ఉచిత పథకాల వల్ల అభివృద్ధి మంద గిస్తుంది. ప్రజలకు మౌలిక వసతులు అందవు.
ఫ యువతను విస్మరించిన ప్రభుత్వం..
- తాండ్ర సదానందం, సీపీఐ జిల్లా కార్యదర్శి
రాష్ట్ర బడ్జెట్‌లో ప్రభుత్వం యువతను పూర్తిగా విస్మరించింది. నిరుద్యోగులకు నెలకు రూ. 3 వేలు ఇస్తామన్న హామీ నెరవేర్చలేక పోయింది. విద్యా రంగానికి గతంలో కంటే కేవలం 0.2 శాతమే నిధు లు ఎక్కువగా కేటాయించారు తప్ప రెట్టింపు చేయ లేదు. విద్య, వైద్యం,యువజన రంగాలకు బడ్జెట్‌లో పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి ఇవ్వడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది.
ఫ కార్మికులను విస్మరించిన బడ్జెట్
- ఎరవెల్లి ముత్యం రావు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కార్మికుల సంక్షేమాన్ని విస్మరించింది. పరిశ్రమలకు అతి తక్కువ బడ్జెట్ కేటాయించింది. కార్మికుల వేతనాల పెంపుపై పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. రాష్ట్రంలో కోటి 20 లక్షల మంది కార్మికులకు వర్తించే 73వ షెడ్యూల్ కనీస వేతనాల జీవోల సవరణ, వేతనాల పెంపు ఊసే ఎత్తక పోవడం అన్యాయం. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కనీస వేతనాల అమలు బడ్జెట్‌లో లేకపోవడం దారుణం.