నేతన్నలకు నిరాశే..
ABN , Publish Date - Mar 20 , 2025 | 01:47 AM
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తొలి బడ్జెట్ ఓట్ అన్ అకౌంట్‌గా ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఈసారి 2025-26 బడ్జెట్ కొత్త సంక్షేమ పథకాలకు దారులు వేస్తుందని భావించినా నిరాశే మిగిలింది. ప్రస్తుతం ప్రభుత్వం కొనసాగిస్తున్న పథకాలే సంబంధించిన కేటాయింపులు మినహా భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాల ప్రస్తావన లేకపోవడంతో జిల్లా ప్రజలు నిరాశ చెందారు. బుధవారం డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో మిశ్రమ స్పందననే కలిగించింది.

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తొలి బడ్జెట్ ఓట్ అన్ అకౌంట్‌గా ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఈసారి 2025-26 బడ్జెట్ కొత్త సంక్షేమ పథకాలకు దారులు వేస్తుందని భావించినా నిరాశే మిగిలింది. ప్రస్తుతం ప్రభుత్వం కొనసాగిస్తున్న పథకాలే సంబంధించిన కేటాయింపులు మినహా భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాల ప్రస్తావన లేకపోవడంతో జిల్లా ప్రజలు నిరాశ చెందారు. బుధవారం డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో మిశ్రమ స్పందననే కలిగించింది. బడ్జెట్ జనరంజకంగా ఉందని కాంగ్రెస్ పక్షం, బీఆర్‌ఎస్, ఇతర పార్టీల నాయకులు అసంతృప్తినే వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అరు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చి అమలు చేస్తున్నా పథకాలపైనే కేటాయింపులు సాగాయి. కొత్త పథకాలు కొత్త ఉత్సాహాన్ని నింపలేక పోరుందనే విమర్శలు వచ్చాయి.
వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి వేగవంతం...
దక్షిణ కాశీగా వెలుగొందుతున్న వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధికి ప్రభుత్వం ఇప్పటికే శ్రీకారం చుట్టింది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇతర మంత్రులు పనులకు శంకుస్థాపనలు చేశారు. బడ్జెట్‌లో వేములవాడ అభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు చేసినట్లు ప్రస్తావించారు. అందుకు సంబంధించిన పనులు త్వరగా పూర్తి చేస్తున్నట్లు వెల్లడించారు. దేవాదాయ శాఖకు రూ.190 కోట్లు బడ్జెట్‌లో ప్రతిపాదించారు. ఈమేరకు మరికొన్ని నిధులు దేవాలయానికి కేటాయిస్తారని భావిస్తున్నారు.
నేతన్నలకు నిరాశే...
కేంద్ర ప్రభుత్వం మెగా పవర్‌లూం క్లస్టర్‌ను ప్రతి బడ్జెట్లలో ఊరించి వెక్కిరిస్తుంది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం సిరిసిల్లను టెక్స్‌టైల్ జోన్‌గా మార్చే ప్రతిపాదనలు రూపొందించినా పెండింగ్‌లోనే ఉండిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మరమగ్గాల పరిశ్రమపై దృష్టిపెడుతుందని సిరిసిల్ల వస్త్ర పారిశ్రామికులు, కార్మికులు ఎంతో అశగా ఎదురు చూశారు. రాష్ట్ర బడ్జెట్‌లోనూ నిధుల కేటాయింపు చేయలేదు. గత ప్రభుత్వ హాయంలో అందించిన ప్రభుత్వ అర్డర్లను నిలిపివేసిన సందర్భంలో గత సంవత్సరం కొనసాగిన అందోళనల ఫలితంగా మళ్లీ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు చేయూతను ఇవ్వడం మొదలైంది. అందులో భాగంగా చేపట్టిన కార్యక్రామాలను బడ్జెట్‌లో ప్రస్తావించారు. చేనేత మరమగ్గాల కార్మికుల సంక్షేమం, సమగ్ర అభివృద్ధి కోసం తెలంగాణ చేనేత అభయ హస్తం పథకాన్ని అమల్లోకి తెచ్చింది. నేతన్న పొదుపు, తెలంగాణ నేతన్న భద్రత, నేతన్నకు భరోసా, కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. మరమగ్గాల కార్మికుల బకాయిలు పడ్ద పది శాతం నూలు సబ్సిడీ రూ 37.49 కోట్లు విడుదల చేస్తున్నట్లు పేర్కోన్నారు. నేత కార్మికుల కోసం వేములవాడలో రూ.50 కోట్ల కార్ఫస్ ఫండ్‌తో యారన్ డిపో ఏర్పాటు చేసినట్లు పేర్కోన్నారు. రాష్ట్రంలో స్వశక్తి సంఘాల్లో ఉన్న 64.7 లక్షల మంది సభ్యులకు యేటా రెండు చీరలు ఇవ్వాలని నిర్ణయించామని వాటి ఉత్పత్తి బాధ్యత నేతన్నలకు అప్పగించాలని నిర్ణయించడంతో పాటు బడ్జెట్‌లో రూ 371 కోట్లు ప్రతిపాదించినట్లు పేర్కోన్నారు.
డబుల్ బెడ్‌రూం ఇళ్లకు మోక్షం..
గత ప్రభుత్వం ఐదేండ్ల పాటు నిరుపేదలకు డబుల్ బెడ్‌రూం ఇండ్లు ఇస్తామని అశలు రేకేత్తించి నిరాశ మిగిల్చిందని పేర్కోన్నారు. అసంపూర్తిగా నిలిచిపోయిన గృహాలకు నిధులు కేటాయించి అందుబాటులోకి తెస్తామని పేర్కోన్నారు. దీని ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో 702 ఇండ్లు నిర్మాణ దశలో అగిపోయాయి. ఈ ఇండ్లకు మోక్షం కలుగుతుందని భావిస్తున్నారు. దీంతో పాటు ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ప్రతి నియోజకవర్గానికి కేటాయించిన 3500 ఇండ్లు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
సంక్షేమ పథకాలకు నిధుల కేటాయింపులు
ప్రభుత్వం అభయహస్తంలో భాగంగా మహాలక్ష్మీ, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, ఫించన్లు, రేషన్ కార్డులపైనా ప్రత్యేక దృష్టి పెట్టారు. మహాలక్ష్మీ పథకంలో గ్యాస్ సిలెండర్లు రూ 500లకే పంపిణీ, గృహాజ్యోతి 200 యూనిట్ల విద్యుత్ మినహాయింపు, రాజీవ్ అరోగ్య శ్రీ రూ 5 లక్షల నుంచి పది లక్షలకు పెంపు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతు కూలీ సంక్షేమం, సన్నవడ్లకు బోనస్‌లతో పాటు భూభారతితో భూ సమస్యల పరిష్కారం వంటివి ప్రస్థావించారు. విద్యారంగంలో ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ స్కూల్‌ల ఏర్పాటును ప్రస్థావించారు. విద్యారంగంతో పాటు మహిళ సంక్షేమంపై దృష్టి పెట్టారు. డిగ్రీ విద్యార్థులకు బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీస్, ఇన్సూరెన్స్ ట్రెయినింగ్ కోర్సులు కూడా అందించడానికి కాలేజీల ఎంపికపై పేర్కోన్నారు. అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్‌లు, డిజిటల్ ఉపాధి కేంద్రాలు, ఏర్పాటు చేయనున్నారు. ఇందిరా మహిళ శక్తి ద్వారా స్వశక్తి సంఘాలకు అందిస్తున్న ప్రొత్సహాలే కాకుండా వ్యాపార రంగాల్లో మినీ గోదాములు, రైస్‌మిల్లులు, ఏర్పాటుకు ఊతమిస్తున్నట్లు తెలిపారు. మహిళలకు భీమా సౌకర్యం, సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల నిర్వహాణలు అన్నీ రంగాల్లో మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కోనడంతో పాటు మహిళ శిశు సంక్షేమ శాఖకు రూ 2862 కోట్లు ప్రతిపాదించారు.
అంగన్‌వాడీల్లో కొలువులు...
అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్నా టీచర్లు, సహాయకుల పోస్టులను భర్తీకి అదేశాలు జారీ చేసినట్లుగా పేర్కోన్నారు. జిల్లాలో 43 టీచర్లు, 174 ఆయా ల పోస్టుల ఖాళీలు భర్తీ కానున్నాయి. దీంతో పాటు త్వరలోనే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్-3 సంబంధించిన ఉద్యోగులకు నియామక పత్రాలు అందించనున్నట్లు పేర్కోన్నారు.
టూరిజంపై ఆశలు
తెలంగాణ ప్రభుత్వం పర్యాటక అభివృద్ధి కోసం నూతన టూరిజం పాలసీని అవిష్కరించినట్లు పేర్కోంది. టూరిజం అభివృద్ధిలో రూ.775 కోట్లు ప్రతిపాదించారు. ఇందులో జిల్లాలో ప్రారంభించి అసంతృప్తిగా మిగిలిన మిడ్ మానేరులోని జల విహారానికి మోక్షం వస్తుందని భావిస్తున్నారు.
వ్యవసాయ రంగంలో ప్రోత్సాహకాలు
వ్యవసాయ రంగంలో రైతులకు రుణమాఫీ, రైతు భరోసా పథకాలను అందించడంతో పాటు సన్నవడ్లకు రూ 500 బోనస్ చెల్లించడం జరిగిందని పేర్కోన్నారు. అయిల్ ఫాం సాగును ప్రొత్సహించడమే కాకుండా రూ 2 వేల వరకు టన్నుకు అదనంగా లబ్ధి చేకూరే విధంగా ప్రొత్సహాం ఇవ్వనున్నట్లు పేర్కోన్నారు. పాడి పశువులు, పశు సంవర్థక శాఖకు భారీగానే బడ్జెట్ కేటాయించారు.