Share News

బడ్జెట్‌పై మిశ్రమ స్పందన

ABN , Publish Date - Mar 20 , 2025 | 01:36 AM

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌) రాష్ట్ర ప్రభుత్వ 3,04,965 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది. ఈ బడ్జెట్‌లో అభివృద్ధికి, సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఈ బడ్జెట్‌ ఆశించిన మేరకు ప్రయోజనకారిగా లేదని పెదవి విరుస్తున్నాయి. కాంగ్రెస్‌ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ఈ బడ్జెట్‌ లేదని వ్యవసాయ, విద్యారంగాలకు బడ్జెట్‌లో 10శాతం నిధులు కూడా దక్కలేదని విమర్శిస్తున్నాయి.

బడ్జెట్‌పై మిశ్రమ స్పందన
బడ్జెట్‌

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

రాష్ట్ర ప్రభుత్వ 3,04,965 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది. ఈ బడ్జెట్‌లో అభివృద్ధికి, సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఈ బడ్జెట్‌ ఆశించిన మేరకు ప్రయోజనకారిగా లేదని పెదవి విరుస్తున్నాయి. కాంగ్రెస్‌ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ఈ బడ్జెట్‌ లేదని వ్యవసాయ, విద్యారంగాలకు బడ్జెట్‌లో 10శాతం నిధులు కూడా దక్కలేదని విమర్శిస్తున్నాయి. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ప్రతిపక్షాలు అంటున్నాయి. అధికార కాంగ్రెస్‌పక్షం మాత్రం బడ్జెట్‌ను స్వాగతిస్తూ ప్రగతికాముక బడ్జెట్‌గా పేర్కొన్నది.

ఫ స్మార్ట్‌సిటీ పనులకు రూ. 179 కోట్లు

బడ్జెట్‌లో కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని స్మార్ట్‌సిటీ పనుల కోసం 179 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ నిధులతో పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. స్పోర్ట్స్‌ స్కూల్‌ అభివృద్ధి పనులకు 21 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో క్రీడా పాఠశాల విద్యార్థులకు మరిన్ని సౌకర్యాలు కల్పించవచ్చు. శాతవాహన యూనివర్సిటీకి 35 కోట్ల రూపాయలు కేటాయించడం జిల్లావాసులకు సంతోషాన్ని కలిగించింది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు ప్రయోజనకారిగా ఉండే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 349.66 కోట్లు, వరద కాలువల పనులకు 299.16 కోట్లు కేటాయించారు. వివిధ శాఖల కింద కేటాయించిన నిధులతో ఆయాశాఖల ద్వారా చేపట్టే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు విడుదల కానున్నాయి.

Updated Date - Mar 20 , 2025 | 01:36 AM