తాగునీటి ఇబ్బందులు రాకుండా పకడ్బందీ చర్యలు
ABN , Publish Date - Mar 19 , 2025 | 01:02 AM
వేసవిలో జిల్లాలో ఎక్కడా తాగునీటి ఇబ్బందులు రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు.

సిరిసిల్ల కలెక్టరేట్, మార్చి 18 (ఆంధ్రజ్యోతి) : వేసవిలో జిల్లాలో ఎక్కడా తాగునీటి ఇబ్బందులు రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో ఆయన తాగునీటి సరఫరా, సమ్మర్ యాక్షన్ ప్లాన్‌పై అధికారులతో సమీక్షించారు. జిల్లాలో మిషన్ భగీరథ గ్రిడ్, ఇంట్రా తాగునీటి సరఫరాలో భాగంగా చేపట్టిన పనులు, ప్రస్తుతం నీటి సరఫరా జరుగుతున్న ఆవాసాలు, వాటర్ సోర్స్, సమస్యాత్మక ప్రాంతాలు, సమ్మర్ యాక్షన్ ప్లాన్ తదితర అంశాలను సమీక్షించి అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ జిల్లాలో తక్కువగా తాగునీరు అందుతున్న గ్రామాలు, భూగర్భ జలాలు తగ్గడం వల్ల అధికంగా పైప్ లైన్ నీటి పై ఆధార పడటం వంటి పలు కారణాలవల్ల నీటి ఇబ్బందులు వచ్చే ఆస్కారం ఉన్న ప్రాంతాలను గుర్తించి అవసరమైన ముందు జాగ్రత్త చర్యలను పకడ్బందీగా చేపట్టాలని, గ్రామాలలో వెంటనే చేపట్టాల్సిన చర్యల ప్రతిపాదనలు సమర్పించాలని అన్నారు. జిల్లాలోని 75 జనావాసాలలో కొన్ని ప్రాంతాలలో తాగు నీటి ఇబ్బందు లు వచ్చే అవకాశం ఉన్నందున అక్కడ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. వేములవాడ సిరిసిల్ల పట్టణాలలో తాగునీటి ఇబ్బందులు రాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. పట్టణ ప్రాం తాల్లో మిషన్ భగీరథ గ్రిడ్ నుంచి అవసరమైన నీరు రాని పక్షంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఈ సమీక్ష్ష సమావేశంలో డీఆర్‌డీవో శేషాద్రి, మిషన్ భగీరథ గ్రిడ్, ఇంట్రా ఈఈలు జానకి, శేఖర్‌రెడ్డి, డి రాము, ఏఈలు, ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లు సమ్మయ్య, అన్వేష్, అధికారులు తదితరులు పాల్గొన్నారు