Share News

అన్ని వర్గాల అభివృద్ధే ప్రజా ప్రభుత్వ ధ్యేయం..

ABN , Publish Date - Mar 21 , 2025 | 12:55 AM

అన్ని వర్గాల ప్రజల అభివృద్ధే ప్రజా ప్రభుత్వం ధ్యేయం అని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ పేర్కొన్నారు.

అన్ని వర్గాల అభివృద్ధే ప్రజా ప్రభుత్వ ధ్యేయం..

రుద్రంగి, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): అన్ని వర్గాల ప్రజల అభివృద్ధే ప్రజా ప్రభుత్వం ధ్యేయం అని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రంలోని రైతు వేదికలో అర్హులైన 35మంది లబ్ధిదారులకు కల్యాణల క్ష్మి చెక్కులను ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ పాల్గొని పంపిణీ చేశారు. ఈ సంద ర్భంగా ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ బలహీన వర్గాలకు విద్య, ఉద్యోగ, అలాగే రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్ల బిల్లు ఆమోదం తెలపడంపై సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలతో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ బిల్లు ప్రవేశపెట్టగా దాన్ని బలపరిచే అవకాశం తనకు వచ్చిం దన్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 34 శాతం ఉన్న రిజర్వేషన్లను 23 శాతానికి పడిపోయేలా చేసింది అన్నారు. రాష్ట్రంలో 2 లక్షల వరకు రుణమాఫీ చేశామని తద్వారా 25.35లక్షల మంది రైతులకు 20,616 కోట్ల రుణమాఫీ జరిగిందన్నారు. రుద్రంగి మండలాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్తానన్నారు. కార్య క్రమంలో తహసీల్దార్‌ శ్రీలత, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చెలుకల తిరుపతి, కాం గ్రెస్‌ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు సామ మోహన్‌ రెడ్డి, మాజీ జడ్పీటీసీ గట్ల మీనయ్య, తర్రె మనోహర్‌, ఎర్రం గంగ నరసయ్య గడ్డం శ్రీనివాస్‌ రెడ్డి, కేసిరెడ్డి నర్సారెడ్డి, గండి నారాయణ, కొమిరె శంకర్‌, మాడిశెట్టి అభిలాష్‌, పల్లి గంగాధర్‌, తర్రె లింగం, స్వర్గం పరంధాములు, దాసరి గంగరాజు, గుగ్గిళ్ళ వెంకటేశం, సూర యాదయ్య, గంధం మనోజ్‌, దయ్యాల శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 21 , 2025 | 12:55 AM