Share News

అధికారుల హామీతో దీక్ష విరమించిన రైతులు

ABN , Publish Date - Mar 22 , 2025 | 12:35 AM

మండలంలోని పెద్దలింగాపూర్‌ గ్రామసమీపంలో రైతులు చేస్తున్న రిలే నిరాహారదీక్షను అధికారుల హామీతో విరమించారు.

అధికారుల హామీతో దీక్ష విరమించిన రైతులు

ఇల్లంతకుంట, మార్చి 21( ఆంధ్రజ్యోతి) : మండలంలోని పెద్దలింగాపూర్‌ గ్రామసమీపంలో రైతులు చేస్తున్న రిలే నిరాహారదీక్షను అధికారుల హామీతో విరమించారు. ఎల్‌ఎమ్‌ 6కెనాల్‌ పనులు పూర్తిచేసి సాగునీటిని అందివ్వాలని ఇల్లంతకుంట, తంగళ్ళపల్లి మండలాలకు చెందిన రైతులు 19 రోజులుగా దీక్ష చేస్తున్నారు. దీక్షాశిబిరం వద్దకు శుక్రవారం చేరుకున్న తహసీల్దార్‌ ఫారూఖ్‌ రైతులతో మాట్లాడారు. రైతుల సమస్యను ఎమ్మెల్యే సత్యనారాయణ గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకవెళ్ళారని, నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు. మూడు నెల ల్లో పనులు పూర్తి అవుతాయన్నారు. దీనిపై రైతులు మాట్లాడుతూ ఇచ్చిన హామీమేరకు దీక్షను విరమిస్తున్నామని, గడువులోపు పనులు కాకపోతే తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట దీక్ష చేస్తామన్నారు. ఇరిగేషన్‌ ప్యాకేజీ 11డీఈ సీతారాం, ఆర్‌ఐ షఫీ, రైతులు అశోక్‌, గన్నేరం నర్సయ్య, గాదె మధు, బాలయ్య, నవీన్‌, లక్ష్మి, అనిత, రేణుక తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 22 , 2025 | 12:35 AM