ప్రశాంతంగా ‘పది’ పరీక్షలు ప్రారంభం
ABN , Publish Date - Mar 22 , 2025 | 12:37 AM
జిల్లాలో తొలిరోజు శుక్రవారం తెలుగు పేపర్ పదో తరగతి పరీక్ష ప్రశాంతంగా జరిగింది. జిల్లా వ్యాప్తంగా 67 కేంద్రాల్లో 11,838 మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 11,826 మంది విద్యార్థులు హాజరయ్యారు. 13 మంది విద్యార్థులు గైర్హాజరయ్యా రు.

- పలు కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాల, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో తొలిరోజు శుక్రవారం తెలుగు పేపర్ పదో తరగతి పరీక్ష ప్రశాంతంగా జరిగింది. జిల్లా వ్యాప్తంగా 67 కేంద్రాల్లో 11,838 మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 11,826 మంది విద్యార్థులు హాజరయ్యారు. 13 మంది విద్యార్థులు గైర్హాజరయ్యా రు. రెగ్యులర్ విద్యార్థులు 99.90 శాతం హాజరయ్యా రు. రెండు పరీక్ష కేంద్రాల్లో 31 మంది ప్రైవేటు విద్యా ర్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 25 మంది హాజరు కాగా, ఆరుగురు విద్యార్థులు గైర్హాజరయ్యారు. కలెక్టర్ సత్యప్రసాద్ జగిత్యాలలో పురాణిపేట పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని, కోరుట్లలోని ఎస్‌ఎఫ్‌ఎస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని సందర్శించి పరీక్ష నిర్వహణను పర్యవేక్షించారు. జిల్లా విద్యాధికారి రాము నాలుగు కేంద్రాలను, స్టేట్ అబ్జర్వర్స్ బృందం ఆరు కేంద్రాలను, జిల్లా పరీక్షల సహాయ పరిశీలనా ధికారి నాలుగు కేంద్రాలను, ఫ్లయింగ్ స్క్వాడ్ 18 కేం ద్రాలను సందర్శించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బం దులు కలగకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.
పెగడపల్లి: మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో 208 మంది విద్యార్థులకు గానూ వందశాతం విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షా కేంద్రాన్ని తహసీల్దార్ బి రవీందర్ తనిఖీ చేశారు.
కొడిమ్యాల: కొడిమ్యాల ఉన్నత పాఠశాల, మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల, పూడూర్‌లోని ఉన్నత పాఠశాలలో పరీక్షలు నిర్వహించగా 393మంది విద్యార్థులకు గానూ 393మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు ఎంఈవో ఎ శ్రీనివాస్ తెలిపారు.
మల్యాల: మండలంలోని జడ్పీ పాఠశాల పరీక్ష కేంద్రంలో ఒక విద్యార్థి గైర్హాజరు అయ్యారు. మండల వ్యాప్తంగా 564మందికి గాను మల్యాల, తాటిపల్లి, రామన్నపేటలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో 563మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు మండల విద్యాధికారి జయసింహరావు తెలిపారు.
సారంగాపూర్: మండలంలో 199 మంది విద్యార్థులకు గానూ 197 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష కేంద్రాన్ని తహసీల్దార్ ఎండీ జమీర్, ఎస్సై దత్తాద్రి సందర్శించారు.
మెట్‌పల్లిటౌన్: పట్టణంలో మొత్తం ఆరు పరీక్ష కేంద్రాల్లో మొత్తం 1234 మంది విద్యార్థులు గాను వంద శాతం విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు మండ ల విద్యాధికారి చంద్రశేఖర్ తెలిపారు. పరీక్ష కేంద్రా లను మండల విద్యాధికారి చంద్రశేఖర్, తహసీల్దార్ పరిశీలించారు.
ఇబ్రహీంపట్నం: మండలంలో మొత్తం 317 మంది విద్యార్థులు గాను 317 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు మండల విద్యాధికారి మధు తెలిపారు.
మెట్‌పల్లి రూరల్: మండలంలోని జగ్గసాగర్‌లో 144 మంది, బండలింగాపూర్‌లోని 94 మంది విద్యార్థులకు గానూ వంద శాతం విద్యార్థులు పరీక్షలకు హాజరైన ట్లు మండల విద్యాధికారి చంద్రశేఖర్ తెలిపారు.
కథలాపూర్: మండలంలోని మోడల్ స్కూల్, కథలాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, గంభీర్‌పూర్, అంబారిపేట పాఠశాలల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో 456 మందికిగాను అంబారిపేట కేంద్రంలో ఓ విద్యార్ధిని పరీక్షకు గైర్హాజరైనట్టు ఎంఈఓ లోకిని శ్రీనివాస్ తెలిపారు. పరీక్షా కేంద్రాలను తహసీల్దార్ వినోద్ పరిశీలించగా ఎస్సై నవీన్ నేతృత్వంలో బందోబస్తు నిర్వహించారు.
వెల్గటూర్: మండలంలోని కుమ్మరిపల్లి మోడల్ స్కూల్‌లో 254 మంది విద్యార్థులు, చెగ్యాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 63 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు మండల విద్యాధికారి ప్రభాకర్ తెలిపారు.
మెట్‌పల్లి రూరల్: మండలంలోని జగ్గసాగర్‌లో 144 మంది, బండలింగాపూర్‌లో 94 మంది విద్యార్థుల కు గానూ వందశాతం విద్యార్థులు పరీక్షలకు హాజరైన ట్లు మండల విద్యాధికారి చంద్రశేఖర్ తెలిపారు.
మల్లాపూర్: మండలంలోని మల్లాపూర్, సాతారం, రాఘవుపేట గ్రామాల్లోని మూడు కేంద్రాల్లో 423 మంది విద్యార్థులకు గాను 422 మంది విద్యార్థులు హాజరయ్యారు.
బీర్‌పూర్: మండలంలో మొత్తం 183 మంది విద్యా ర్థులకు గానూ వంద శాతం విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు ఎంఈవో నాగభూషణం తెలిపారు.
గొల్లపల్లి: మండలంలో మొత్తం 426 మంది విద్యా ర్థులకు గాను 425 మంది విద్యార్థులు పరీక్షలు రాశార ని మండల విద్యాధికారి జమునా దేవి తెలిపారు. పరీ క్షకేంద్రాన్ని ఆర్జేడీ సత్యానారాయణరెడ్డి పరిశీలించారు.
ధర్మపురి: మండలంలో నాలుగు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా మొత్తం 647 మంది విద్యార్థులకు గాను 646 మంది విద్యార్థులు హాజరైనట్ల ఎంఈవో సంగనభట్ల సీతాలక్ష్మి తెలిపారు.
కోరుట్ల రూరల్: కోరుట్ల పట్టణంలో రెండు, మండలంలో ఆరు కేంద్రాల్లో 1603 మంది విద్యార్థుకు గానూ 1601 మంది విద్యార్థులు పరీక్షలు రాశారని, ఇద్దరు గైర్హాజరైనట్లు ఎంఈవో నరేశం తెలిపారు.