Online Gaming Sites: ఆన్‌లైన్ గేమింగ్ వెబ్‌సైట్స్‌పై కేంద్రం కొరడా
ABN , Publish Date - Mar 22 , 2025 | 07:30 PM
Online Gaming Sites: ఆన్‌లైన్ గేమింగ్ వెబ్‌సైట్స్‌కు బిగ్ షాక్ తగిలింది. అక్రమంగా నిర్వహిస్తున్న వెబ్‌సైట్లను డీజీజీఐ బ్లాక్ చేసింది. గేమింగ్ సంస్థలకు చెందిన బ్యాంక్ ఖాతాలను బ్లాక్ , సీజ్ చేసింది.

ఢిల్లీ: ఆన్‌లైన్ మనీ గేమింగ్ వెబ్‌సైట్లపై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. ఆన్‌లైన్ మనీ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లను ఆర్థిక శాఖ పరిధిలోని డీజీజీఐ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటలిజెన్స్) బ్లాక్ చేసింది. పన్ను ఎగవేతను అరికట్టడానికి ఆఫ్‌షోర్ ఆన్‌లైన్ మనీ గేమింగ్ సంస్థలపై డీజీజీఐ కఠినంగా వ్యవహరిస్తోంది. చట్టవిరుద్ధమైన, ఆఫ్‌షోర్ ఆన్‌లైన్ మనీ గేమింగ్ ఎంటీటీల 357 వెబ్‌సైట్‌లు, URLలను కేంద్రప్రభుత్వం బ్లాక్ చేసింది.
అక్రమంగా నిర్వహిస్తున్న 357 వెబ్‌సైట్లను డీజీజీఐ బ్లాక్ చేసింది. గేమింగ్ సంస్థలకు చెందిన 2,400 బ్యాంక్ ఖాతాలను బ్లాక్ , సీజ్ చేసింది. రూ. 126 కోట్లను డీజీజీఐ ఫ్రిజ్ చేసింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆఫ్‌షోర్ ఆన్‌లైన్ మనీ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లను వాడవద్దని ప్రజలకు డీజీజీఐ సూచించింది. గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లతో లింక్ చేయబడిన 166 మ్యూల్ ఖాతాలను డీజీజీఐ బ్లాక్ చేసింది. ఇప్పటి వరకు ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశామని, విచారణ కొనసాగుతోందని డీజీజీఐ వెల్లడించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
JAC Meet Delimitation: డీలిమిటేషన్‌పై హైదరాబాద్‌లో జేఏసీ తదుపరి భేటీ
Chennai: మాజీసీఎం ఘాటు సమాధానం.. మీ పార్టీని తన్నుకుపోతారు
MLA: ఇంత దారుణం ఎన్నడూ చూడలేదు.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..