Share News

Iftar: అల్ ఖోబర్‌లో సాట్స్ ఇఫ్తార్ విందు కార్యక్రమం

ABN , Publish Date - Mar 22 , 2025 | 08:08 PM

సౌదీ అరేబియాలోని చమురు రంగానికి నెలవు అయిన ఈశాన్య ప్రాంతంలోని అల్ ఖోబర్, దమ్మాం, జుబేల్, రాస్ తణురా ప్రాంతాలలో ప్రసిద్ధి గాంచిన తెలుగు ప్రవాసీ సంఘమైన ‘సాట్స్’ ఇటీవల అల్ ఖోబర్ లో ఇఫ్తార్ విందు నిర్వహించింది.

Iftar: అల్ ఖోబర్‌లో సాట్స్ ఇఫ్తార్ విందు కార్యక్రమం

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: తమ ఇష్టపూర్వకంగా ఒక మతస్థులు మరొకర్ని విందుకు ఆహ్వానించి వడ్డించే వారే నిజంగా విశాల హృదయులు. అందునా హిందూ, ముస్లిం, క్రైస్తవులు కలిసికట్టుగా చేసే విందు భోజనాలు మైత్రి వెల్లివెరిసి ఆత్మీయ అనుబంధాలు బలోపేతం కావడానికి దోహదపడతాయి. అది దైవ కార్యంగా భావించి నిర్వహిస్తే మానవత్వానికి దైవత్వం తోడవుతుంది.

సౌదీ అరేబియాలోని చమురు రంగానికి నెలవు అయిన ఈశాన్య ప్రాంతంలోని అల్ ఖోబర్, దమ్మాం, జుబేల్, రాస్ తణురా ప్రాంతాలలో ప్రసిద్ధి గాంచిన తెలుగు ప్రవాసీ సంఘమైన ‘సాట్స్’ ఇటీవల అల్ ఖోబర్ లో నిర్వహించిన ఇఫ్తార్ విందులో మతం ఏదైనా మనమందరం ఒక్కరే అనే నినాదాన్ని ప్రతిబింబించింది. ‘అల్లాహుమ్మ లక సుంతు వబిక ఆమంతు’ అంటూ విజయవాడకు చెందిన శేఖ్ గులాం దుస్తగీరి ఉపవాస దీక్షను వీడుతుండగా.. పక్కనే కోనేరు ఉమా మహేశ్వర రావు మరోవైపు వరప్రసాద్.. గౌరవ సూచకంగా తోడయిన సన్నివేశం భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబించింది.

2.jpg


Riyadh: రియాద్‌లో సాటా సెంట్రల్ ఇప్తార్ విందు

ఇంటా బయటా అసహనం వెల్లడవుతూ.. అంతటా విద్వేష వాతావరణం కనిపిస్తున్న వేళ హిందూ ముస్లిం, క్రైస్తవ మతాలకు చెందిన తెలుగు ప్రవాసీయులు అంతా కలిసికట్టుగా నిర్వహించిన ఈ కార్యక్రమం ‘జాన్ జానీ జనార్ధన్’గా నిలిచింది. తెలుగు ప్రవాసీయుల ప్రతి సుఖం, సంతోషం, దుఖంలో సాట్స్ పాలుపంచుకుంటుందని సాట్స్ ప్రతినిధులు పేర్కొన్నారు. సంక్రాంతి, ఉగాది, దసరా, దీపావళి, క్రిస్మస్, రంజాన్ పండుగలను తమ సంఘం వైభవంగా నిర్వహిస్తుందని వారన్నారు. చాలా కాలంగా ప్రతి సంవత్సరం రంజాన్ ఇఫ్తార్ విందును పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహిస్తున్నామని ఉమా మహేశ్వర రావు పేర్కొన్నారు.


Also Read: తానా మహాసభలు.. ఏపీ శాసనసభ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడికి ఆహ్వానం

ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని అసిఫ్ ముజీబ్ ఇమామీ, రసూల్, అబ్దుల్ మజీద్, ఆయాజ్ ఖాన్, హసీనా, నూర్ అహ్మద్, గులాం ఖాన్, సలీం, ఇర్షాద్‌లు సమన్వయం చేయగా సాట్స్ అధ్యక్షులు నాగశేఖర్, ఉమామహేశ్వర రావు, పాపారావు, శ్రీనివాస్, రాజు, శివ, కిషోర్, దిలీప్, నర్సింహారావు, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని ఎన్నారై వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Mar 22 , 2025 | 08:08 PM