ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో టోకెన్ సమ్మె
ABN , Publish Date - Mar 08 , 2025 | 12:12 AM
ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో శుక్రవారం మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో టోకెన్ సమ్మె జరిగింది. ఉదయం గేటు వద్ద కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. వేతనాలు పెంచాలనే ప్రధాన డిమాండ్‌తో సమ్మెకు పిలుపునిచ్చారు. కార్మికులు మిశ్రమంగా స్పందించారు.

కోల్‌సిటీ, మార్చి 7(ఆంధ్రజ్యోతి): ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో శుక్రవారం మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో టోకెన్ సమ్మె జరిగింది. ఉదయం గేటు వద్ద కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. వేతనాలు పెంచాలనే ప్రధాన డిమాండ్‌తో సమ్మెకు పిలుపునిచ్చారు. కార్మికులు మిశ్రమంగా స్పందించారు. కార్మికులు విధులు బహి ష్కరించి నిరసన వ్యక్తం చేస్తుండడంతో ఎన్‌టీపీసీ పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఎస్‌ఐ ఉదయ్ కిరణ్ కార్మికులతో మాట్లాడారు. పరిశ్రమ గేట్ వద్ద ఆందోళ నలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మ జ్దూర్ యూనియన్ నాయకుడు అంబటి నరేష్, కార్మి కులనుద్దేశించి మాట్లాడారు. ఆర్‌ఎఫ్‌సీఎల్ యాజ మాన్యం నిరంకుశంగా వ్యవహరిస్తుందన్నారు. వెం టనే వేతన సవరణ చేయాలన్నారు. ఆర్‌ఎఫ్‌సీఎల్ కార్మికుల ఆందోళనలకు బీఆర్‌ఎస్ నాయకులు కౌశిక హరి మద్దతు ప్రకటించారు. ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో ఒక్క ఉద్యోగి కూడా సంతోషంగా లేడని, ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో నిర్భంధం కొనసాగుతుందన్నారు. ఈ ఆందోళనలో కోం డ్ర రూపేష్, సలీం, కల్లేపల్లి దేవయ్య, మారం తిరు పతి, కరుణాకర్, జంగ కృష్ణ, రమేష్ పాల్గొన్నారు.
మిశ్రమ స్పందన...
ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో టోకెన్ సమ్మె విషయంలో కాం ట్రాక్టు కార్మికులు మిశ్రమంగా స్పందించారు. వేతనాల విషయంలో చాలా రోజులుగా ఇబ్బంది పడుతున్న కార్మికులు ఆందోళనల్లో భాగస్వామ్యులయ్యారు. కొద్ది సేపు నిరసన తెలిపిన అనంతరం మెజార్టీ కార్మికులు విధులకు హాజరయ్యారు. కార్మికుల టోకెన్ సమ్మెతో యూరియా లోడింగ్‌కు కొంత ఆటంకం ఏర్పడింది. రేక్‌లో లోడింగ్ గంటపాటు ఆలస్యమైంది. రైల్వే నిబంధనల ప్రకారం గంట జాప్యానికి రూ.70వేల అపరాధ రుసుము పడనున్నది.