Share News

నిబంధనల ప్రకారమే పని చేస్తున్నాం..

ABN , Publish Date - Apr 03 , 2025 | 12:51 AM

సిరిసిల్ల వస్త్ర పరి శ్రమనే కాదు.. తాము ఎవరికి వ్యతిరేకం కాదని నిబంధ నల ప్రకారమే పనిచేస్తున్నామని సెస్‌ చైర్మన్‌ చిక్కాల రామారావు అన్నారు.

నిబంధనల ప్రకారమే పని చేస్తున్నాం..

సిరిసిల్ల, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): సిరిసిల్ల వస్త్ర పరి శ్రమనే కాదు.. తాము ఎవరికి వ్యతిరేకం కాదని నిబంధ నల ప్రకారమే పనిచేస్తున్నామని సెస్‌ చైర్మన్‌ చిక్కాల రామారావు అన్నారు. బుధవారం సిరిసిల్ల సెస్‌ కార్యాల యంలో ఎండీ విజయేందర్‌రెడ్దితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. చైర్మన్‌ చిక్కాల రామారావు మాట్లాడుతూ విద్యుత్‌ సంస్థలకు, వినియోగదారులకు వారధిగా సెస్‌ పనిచేస్తుందని, 50 సంవత్సరాలుగా ఎన్నడూ లేనివిధంగా సెస్‌ను బద్నాం చేస్తున్నారన్నారు. పవర్‌లూం కార్మికులు, యజమానులను ఇబ్బందులకు గురిచేయడం లేదన్నారు. హైకోర్టు అదేశాల మేరకు ముందుకువెళుతున్నామని అన్నారు. సెస్‌కు రూ 162 కోట్ల బకాయిలు రావాల్సి ఉన్నా ఎవరిపై ఒత్తిడి చేయ డం లేదన్నారు. సిరిసిల్లలో 127ఎస్‌ఎస్‌ఐ యూనిట్లు నడుస్తున్నాయని వీటికి సంబంధించి విద్యుత్‌ వాడకంపై కొందరు హైకోర్టును ఆశ్రయిం చడం వల్ల బ్యాక్‌ బిల్లింగ్‌ చేయడం జరిగిందన్నారు. బ్యాక్‌ బిల్లింగ్‌ ఉన్నా రెగ్యులర్‌ బిల్లులు చెల్లించాలని కోరినా చెల్లించకపోవడంతోనే విద్యుత్‌ సరఫరా నిలిపివేశామన్నారు. పూర్తిగా పరిశ్రమలకు కరెంట్‌ నిలిపివేశారనే ప్రచారం చేస్తున్నారన్నారు. సిరిసిల్లలో 2964 పరిశ్రమ లు కొనసాగుతున్నాయన్నారు. బిల్లింగ్‌ విషయంలో కొందరు పాలక వర్గాలను బెదిరింపులకు కూడా గురిచేస్తున్నారన్నారు. తాము నిబం ధనల ప్రకారం పనిచేస్తున్నామని, ఎవరి మీద ఒత్తిడి చేయడం లేద న్నారు. కొందరు సెస్‌ను ఎన్‌పీడీసీఎల్‌లో కలపాలని డిమాండ్‌ చేస్తు న్నారని, ఇది సరైన విదానం కాదన్నారు. పవర్‌లూం పరిశ్రమకు రాయితీలో 30 హెచ్‌పీలకు విద్యుత్‌ వాడకాన్ని పెంచాలని కోరగా, దాని ప్రకారం 25హెచ్‌పీల వరకు పెంచారని గుర్తుచేశారు. ఎన్‌పీడీసీ ఎల్‌ కంటే మెరుగ్గా సెస్‌ పనిచేస్తుందన్నారు. సెస్‌ ఎండీ విజయేందర్‌ రెడ్డి మాట్లాడుతూ సిరిసిల్లలో పవర్‌లూం పరిశ్రమకు 2001లో ఐదు హెచ్‌పీల లోడ్‌తో 50శాతం రాయితీ జీవో అప్పటి ప్రభుత్వం ఇచ్చిం దని, దానిని పది హెచ్‌పీలకు పెంచామన్నారు. పది హెచ్‌పీల కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న పరిశ్రమలను 4వ కేటగిరీ నుంచి మూడవ కేటగిరీకి మార్చామన్నారు. 127ఎస్‌ఎస్‌ఐ యూనిట్లకు బ్యాక్‌ బిల్లింగ్‌ నోటీసులు జారీ చేశామన్నారు. పవర్‌లూం యజమానులు కోరిన మేరకు రెగ్యులర్‌ బిల్లు చెల్లింపుపై చర్చలు కూడా జరిగాయన్నారు. ఎస్‌ఎస్‌ఐ యూనిట్లు ఒప్పందాల ప్రకారం రెగ్యులర్‌ బిల్లు కూడా చెల్లించలేదన్నారు. 127 ఎస్‌ఎస్‌ఐ యూనిట్లు 744 సర్వీసులకు సంబం ధించి రూ 31.94 కోట్ల బకాయిలు ఉన్నాయన్నారు. తాము హైకోర్టు నిబంధనల ప్రకారం బిల్లింగ్‌ చేశామన్నారు. ఈ సమావేశంలో వైస్‌చైర్మన్‌ దేవరకొండ తిరుపతి, డైరెక్టర్లు దార్నం లక్ష్మీనారాయణ, సందుపట్ల అంజిరెడ్డి, కోట్టెపల్లి సుధాకర్‌, అకుల గంగారాం, రేగులపాటి హరిచరణ్‌రావు, వరుస కృష్ణహరి, మాడుగుల మల్లేశం, గౌరీనేని నారాయణరావు, ఆకుల దేవరాజం, మల్లుగారి రవీం దర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 03 , 2025 | 12:51 AM