Health Department: వైద్యారోగ్య శాఖలో కీలక విభాగాధిపతిపై విచారణ ?
ABN , Publish Date - Mar 30 , 2025 | 01:51 AM
వైద్య ఆరోగ్య శాఖలో ఓ కీలక విభాగానికి అధిపతి(హెచ్‌వోడీ), ఆ కార్యాలయంలోని మరో ఆరుగురిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. వారిపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు రావడంతో ఈ చర్యలు తీసుకుంది.

హెచ్‌వోడీ, మరో ఆరుగురిపై అవినీతి ఆరోపణలు
విచారణాధికారికిగా ఐఎఎస్ అధికారి కర్ణన్ !
హైదరాబాద్, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): వైద్య ఆరోగ్య శాఖలో ఓ కీలక విభాగానికి అధిపతి(హెచ్‌వోడీ), ఆ కార్యాలయంలోని మరో ఆరుగురిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. వారిపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు రావడంతో ఈ చర్యలు తీసుకుంది. వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్, ఎన్‌హెచ్‌ఎమ్ డైరెక్టర్ కర్ణన్‌ను విచారణ అధికారిగా నియమించింది. 15 రోజుల్లోగా విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని శనివారం ఆదేశాలు జారీ చేసింది. తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు హెచ్‌వోడీ.. సీనియారిటీ ప్రకారం పదోన్నతుల జాబితాలో మొదటి వరుసలో ఉన్నారు. గత ప్రభుత్వం ఆ అధికారికి కీలక బాధ్యతలు అప్పగించగా పెద్దఎత్తున అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో అంతర్గత విచారణ జరిపించిన ప్రభుత్వం ఆ అధికారిని అప్రాధాన్య పోస్టుకు పంపించింది.
కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత కీలక విభాగానికి ఇన్‌చార్జి హెచ్‌వోడీగా వచ్చిన సదరు అధికారి.. గతేడాది సాధారణ బదిలీల్లో భారీగా అక్రమాలకు పాల్పడినట్లు ఆ శాఖ ఉద్యోగులు బహిరంగంగా మాట్లాడుతున్నారు. ఆ అధికారి కార్యాలయంలో పని చేసే మరో ఆరుగురికి ఈ అవినీతిలో భాగస్వామ్యం ఉందనే ప్రచారమూ జరిగింది. ఈ అంశంపై వైద్యశాఖ మంత్రి విజిలెన్స్ విచారణ చేయించారు. విజిలెన్స్ నివేదిక అనంతరం గతేడాది నవంబరులో సదరు అధికారి, ఆ కార్యాలయంలో పనిచేస్తున్న మరో ఆరుగురికి చార్జీమోమోలు జారీ చేశారు. అయితే వారిచ్చిన వివరణపై సర్కారు సంతృప్తి చెందలేదని సమాచారం. తాజాగా సాధారణ బదిలీల్లో జరిగిన అక్రమాలు, కార్యాలయంలో జరుగుతోన్న అవినీతి అంశంపై విచారణ చేపట్టి నివేదికివ్వాలని కమిషనర్ కర్ణన్‌ను సర్కారు ఆదేశించింది. కాగా, తీవ్రమైన అవినీతి ఆరోపణలు, చార్జీమోమోలు, విచారణలు ఎదుర్కొంటున్న సదరు అధికారినే కీలక విభాగానికి ఇన్‌చార్జి హెచ్‌వోడీగా సర్కారు కొనసాగించడం కొసమెరుపు.
ఈ వార్తలు కూడా చదవండి
Hyderabad Metro : అదిరిపోయే శుభవార్త చెప్పిన HYD మెట్రో.. రైళ్ల ప్రయాణ వేళలు పొడిగింపు..
GPO Posts: నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
Sunny Yadav Betting App Case: బెట్టింగ్ యాప్స్ కేసు.. ఒక్కొక్కరికీ చుక్కలు చూపిస్తున్న పోలీసులు
Read Latest Telangana News And Telugu News