Share News

KTR: జింక రక్తపు మరకలు రాహుల్‌ చేతికే అంటాయి

ABN , Publish Date - Apr 05 , 2025 | 03:49 AM

ఆ జింక రక్తపు మరకలు రాహుల్‌ గాంధీ చేతికే అంటాయని ఎక్స్‌ వేదికగా ఆయన విమర్శించారు. కంచ గచ్చిబౌలి అటవీ ప్రాంతాన్ని రేవంత్‌రెడ్డి బుద్ధిహీనంగా ధ్వంసం చేయడం వల్ల విలువైన వృక్ష, జంతుజాలానికి నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు.

KTR: జింక రక్తపు మరకలు రాహుల్‌ చేతికే అంటాయి

  • రేవంత్‌ చర్యలతో వృక్ష, జంతుజాలానికి నష్టం: కేటీఆర్‌

కంచ గచ్చిబౌలి భూముల్లో విధ్వసం తర్వాత విచ్చలవిడిగా సంచరిస్తున్న కుక్కలు.. ఓ జింకపై దాడి చేశాయని, తీవ్రంగా గాయపడిన జింకను హెచ్‌సీయూ విద్యార్థులు, సెక్యూరిటీ సిబ్బంది వెటర్నరీ ఆస్పత్రికి తరలించేసరికే మృత్యువాత పడిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ జింక రక్తపు మరకలు రాహుల్‌ గాంధీ చేతికే అంటాయని ‘ఎక్స్‌’ వేదికగా ఆయన విమర్శించారు. కంచ గచ్చిబౌలి అటవీ ప్రాంతాన్ని రేవంత్‌రెడ్డి బుద్ధిహీనంగా ధ్వంసం చేయడం వల్ల విలువైన వృక్ష, జంతుజాలానికి నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు.

Updated Date - Apr 05 , 2025 | 03:49 AM