Share News

వైభవంగా లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు

ABN , Publish Date - Mar 30 , 2025 | 11:55 PM

మండలంలోని బొమ్మరాజుపల్లి శివారులో గు ట్టపై వెలసిన లక్ష్మీచెన్నకేశవ స్వామి వారి బ్ర హ్మోత్సవాలు ఉగాది పర్వదినం పురస్కరిం చుకొని వైభవంగా కొనసాగుతున్నాయి.

వైభవంగా లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు

వైభవంగా లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు

ఊర్కొండ, మార్చి 30 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని బొమ్మరాజుపల్లి శివారులో గు ట్టపై వెలసిన లక్ష్మీచెన్నకేశవ స్వామి వారి బ్ర హ్మోత్సవాలు ఉగాది పర్వదినం పురస్కరిం చుకొని వైభవంగా కొనసాగుతున్నాయి. ఆదివా రం లక్ష్మీచెన్నకేశవ స్వామిని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూ జలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆలయం అభివృద్ధికి తనవంతు కృషి చేస్తామని తెలిపారు. అంతకుముందు మాదారం మాజీ సర్పంచ్‌ ద్యాప నిఖిల్‌రెడ్డి గుట్టపై ఏర్పాటు చేసి న హైమాస్ట్‌ లైట్‌, భక్తులు దాహార్తిని తీర్చడానికి నిర్మించిన నీటి ట్యాంకును ఎమ్మెల్యే ప్రారంభిం చారు. వారి వెంట మాజీ సర్పంచ్‌ ద్యాప నిఖిల్‌ రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి రమేష్‌నాయక్‌, కాంగ్రెస్‌ యువజన విభాగం మండల అధ్యక్షు డు ఆదినారాయణ, మాజీ సర్పంచ్‌ పెంటయ్య, నాయకులు వాటం రాఘవేంద్ర, లోహిత్‌రెడ్డి, గోపీనాయక్‌, మనోహర్‌రెడ్డి ఉన్నారు.

Updated Date - Mar 30 , 2025 | 11:55 PM