BJP: మీరిచ్చే ఆరుకిలోల సన్న బియ్యంలో ఐదు కేంద్రానివే..
ABN , Publish Date - Apr 02 , 2025 | 09:39 AM
బీజేపీ కార్పొరేటర్ శ్రీవాణి అంజన్ ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. మీరిచ్చే ఆరుకిలోల సన్న బియ్యంలో ఐదు కేంద్రానివే.. అంటూ పేర్కొన్నారు. అందిస్తున్నది కేంద్రప్రభుత్వమైతే.. ప్రచారం చేసుకుంటుంది మాత్రం రాష్ట్ర ప్రభుత్వమని ఆమె అన్నారు.

- కార్పొరేటర్ శ్రీవాణి అంజన్
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణాల్లో మంగళవారం నుంచి ప్రజలకు పంపిణీ చేస్తున్న ఆరు కిలోల సన్నబియ్యంలో కేంద్రం 5 కిలోలు ఇస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం కిలో మాత్రమే ఇస్తున్నదని సరూర్‌నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అంజన్(Saroornagar Corporator Akula Srivani Anjan) చెప్పారు. మంగళవారం సరూర్‌నగర్‌లోని రేషన్ షాపులకు వెళ్లి అక్కడ జరుగుతున్న సన్నబియ్యం పంపిణీని ఆమె పరిశీలించారు.
ఈ వార్తను కూడా చదవండి: MLA Raja Singh: వక్ఫ్‌బోర్డు బిల్లుకు మద్దతు ఇవ్వండి
రేషన్ దుకాణాలలో ప్రధానమంత్రి మోదీ(Prime Minister Modi) చిత్రపటాలను ఏర్పాటు చేశారు. తెలంగాణ(Telangana) ప్రజల సంరక్షణ, సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి గుర్తింపు ఇవ్వడం అవసరమని రాష్ట్ర ప్రభుత్వానికి ఆమె సూచించారు. కార్యక్రమంలో బీజేపీ డివిజన్ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Ipupuva Laddu: ఇప్పపువ్వు లడ్డూ!
ప్రయాణికులకు తప్పనున్న చిల్లర తిప్పలు
Read Latest Telangana News and National News